అవును గుడివాడలో కొడాలి నానిని ఎవరు ఏం చేయలేరు..ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన, కొడాలి నానిని ఎంత నెగిటివ్ చేయాలని చూసినా సరే, గుడివాడలో కొడాలిని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. కానీ కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ మాత్రం విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కొడాలిని ఇరికించాలని చూస్తున్నారు. తాజాగా క్యాసినో వ్యవహారంపై పెద్ద ఎత్తున కొడాలిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే...కానీ క్యాసినోతో తనకు సంబంధం లేదని, తనని ఎవరు ఏం చేయలేరని కొడాలి అంటున్నారు.

కొడాలి కాన్ఫిడెన్స్‌లో నిజముంది..గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే గుడివాడ ప్రజలు పూర్తిగా కొడాలి వైపే ఉన్నారు. పైగా ఇక్కడ టీడీపీ చాలా వీక్‌గా ఉంది. అలాగే గుడివాడలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయినా సరే కొడాలికి ఫాలోయింగ్ తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ప్రజల మనిషిగా ఉంటారు కాబట్టి, మెజారిటీ ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతారు....పైగా పార్టీలకు అతీతంగా గుడివాడలో నానికి ఫాలోయింగ్ ఉంది...అదే నాని విజయానికి కారణం. ఆ ధైర్యంతోనే గుడివాడలో తనని ఎవరు ఏం చేయలేరని నాని చెబుతూ ఉంటారు.


సరే నానికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు..కాకపోతే ఒక డౌట్ అనేది చాలామందికి ఉంది. ఎవరు ఏం చేసిన తనకు ఏం కానప్పుడు..చంద్రబాబుని కొడాలి ఎడాపెడా తిడుతూ ఉంటారు. దాని వల్ల కూడా చంద్రబాబుకు పోయేది ఏమి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అసలు కొడాలి తిట్టినట్లు, చంద్రబాబుని ఇంతవరకు ఎవరు తిట్టలేదు.

అయితే ఆ తిట్లు అన్నీ ప్రజలు పట్టించుకుంటారా? అంటే పట్టించుకోరనే చెప్పొచ్చు. పైగా కొడాలి తిట్టడం వల్ల రివర్స్‌లో వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉందని, సొంత పార్టీ శ్రేణులే అనుకుంటున్నారని తెలుస్తోంది. కొడాలికి ఏమి కాకపోవచ్చు గాని, ఆయన బూతుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే భయం కార్యకర్తల్లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: