పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చే స్టేట్మెంట్లు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడూ తమ తప్పును కవర్ చేసుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది పాకిస్థాన్ ప్రభుత్వం. ఒకవైపు దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది అంటూ గొప్పలు చెప్పుకోవడం కేవలం ఇమ్రాన్ ఖాన్ కే సాధ్యం అవుతుంది అని చెప్పాలి.

 కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పైనే దృష్టి పెట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం అటు దేశ ప్రజల ప్రయోజనాలను మాత్రం గాలికి వదిలేసింది. చైనా దగ్గర విపరీతంగా అప్పులు తీసుకుని ఇక ఇప్పుడు అప్పులు చెల్లించలేని నేపథ్యంలో తమ సార్వభౌమాధికారాన్ని చైనా దగ్గర ఆకట్టు పెట్టడం  లాంటివి కూడా చేసింది.. ఇక ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్  నిబంధనల నేపథ్యంలో పాకిస్తాన్లో  ఎలాంటి కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రోజురోజుకీ పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం పెరిగిపోతూనే ఉంది. దీంతో అక్కడ అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అటు దేశ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అన్న విషయం తెలిసిందే.



 ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తుంది అనే చెప్పాలి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ భవనాలను అద్దెకు ఇచ్చి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని పరిస్థితి ఏర్పడింది. అదే ఆర్థిక సంక్షోభం  వల్ల తన సొంత ఇంటిని కూడా అద్దెకు ఇచ్చి ఇక ఆ డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అంటూ ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో సమస్యల కారణంగా ఎన్నో నిద్ర లేని రాత్రులను కూడా గడుపుతున్నాను అంటూ ప్రజలందరినీ నమ్మించి సానుభూతిని పొందేందుకు ప్రయత్నించారు ఇమ్రాన్ఖాన్. కాగా ఈ స్టేట్మెంట్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఇమ్రాన్ ఖాన్  ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అంటూ విశ్లేషకులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: