ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రోజురోజుకు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో యుద్ధం తలెత్తుతుందో అనే విధంగా మారిపోయింది పరిస్థితి. ఇక మరోవైపు అటు చైనా కూడా తైవాన్ విషయంలో మరోసారి తెగింపును చూపిస్తుండటం గమనార్హం. గత కొన్ని నెలల నుంచి తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు. తైవాన్ స్వాధీనం చేసుకుంటే ఊరుకునేది లేదని తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి అంటూ అటు అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ చైనా మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.


 ఈ క్రమంలోనే తైవాన్ చైనా మధ్య కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగానే ఉంది. ఇటీవలి కాలంలో తైవాన్ సరిహద్దులో చైనా మరింత ఓవరాక్షన్ చేయడం మొదలు పెట్టింది అని చెప్పాలి. సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను  మోహరించడం చేస్తుంది చైనా. అదే సమయంలో అమెరికా జపాన్ తైవాన్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల చైనా ఏకంగా తైవాన్ గగనతలంలో కి 35 యుద్ధ విమానాలను పంపించడం సంచలనంగా మారిపోయింది.


 ఇక మరోవైపు ఇక ఉక్రెయిన్ కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాన్ని తెగిపోయేలా ఉక్రెయిన్ సముద్ర జలాలలో యుద్ధ నౌకల తో మూసివేసేందుకు చైనా ప్లాన్ వేసింది. ఇక ఇలాంటి సమయంలోనే  చైనా కు షాక్ ఇస్తూ అమెరికా జపాన్ కూడా సముద్రజలాల్లో భారీగా యుద్ధ విన్యాసాలు ప్రారంభించడం సంచలనంగా మారిపోయింది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా ప్రస్తుతం అమెరికా జపాన్ యుద్ధ విన్యాసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు  చైనా మొండిగా ముందడుగు వేస్తుండటం చూస్తుంటే చైనా కూడా యుద్ధానికి సిద్ధమైంది అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: