ఏపీలో 25 మంది ఎంపీలు ఉన్నారు...వైసీపీకి 22, టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు...ఇక ఈ లెక్కలు అందరికీ తెలుసనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించే ప్రజలకు ఆ మాత్రం తెలియకుండా ఉండవు కదా. సరే ఈ లెక్కలు బాగానే తెలిసాయి. వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీలు, టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు గురించి జనాలకు తెలుసా? అంటే భలేవాళ్లు టీడీపీలో రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్‌లని జనాలు బాగా గుర్తుపడతారు.

ఎందుకంటే వీరు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతారు...అలాగే ఎంపీ నిధులతో తమ స్థానాల్లో కొద్దో గొప్పో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇక రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతారు..కాబట్టి వీరు ప్రజలకు బాగానే తెలుసని చెప్పొచ్చు. మరి వైసీపీలో ఎంపీలు గురించి తెలుసా అంటే...ఏదో మిథున్ రెడ్డి, మార్గాని భరత్, శ్రీకృష్ణ, అవినాష్ రెడ్డి...ఇలా నాలుగైదు పేర్లు తెలుసని చెబుతారు. ఇక కొందరు ఎంపీలు...తమ పార్లమెంట్ స్థానాల్లో ఉన్న ప్రజలకు తెలుసు.

ఇక విచిత్రమైన విషయం ఏంటంటే....కొందరు ఎంపీలు తమ స్థానాల్లో ఉన్న ప్రజలకు తెలియకపోవడం...మరి అలాంటి వారు వైసీపీలో బాగానే ఉన్నారు. అసలు వారు లోక్‌సభలో పెద్దగా కనిపించరు...రాజకీయాల్లో పెద్దగా కనిపించరు...అలాగే ప్రజల్లో కనిపించరు...ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ కనిపించరు. ఉదాహరణకు చెప్పుకుంటే విశాఖపట్నం జిల్లా ఎంపీల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ముగ్గురు ఎంపీలు ఉన్నారు....విశాఖ ఎంపీగా సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీగా సత్యవతి, అరకు ఎంపీగా మాధవి ఉన్నారు.

కొద్దో గొప్పో సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, సినిమా నిర్మాతగా జనాలకు కొంచెం తెలుసు. కానీ సత్యవతి, మాధవిలు ఎంపీలు అనే సంగతి సొంత పార్టీ కార్యకర్తలకే చాలమందికి తెలియదని విశ్లేషకులు అంటున్నారు. పైగా మాధవి మొదట్లో అతి పిన్న వయసులో ఎంపీ అయ్యారని వార్తల్లోకి ఎక్కారు...అంతే మళ్ళీ తర్వాత ఆమె వార్తల్లో కనిపించలేదు. వాస్తవానికి చూస్తే మాధవి, సత్యవతిలు ఎంపీలని గుర్తుపెట్టుకోవాల్సి ఉందని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: