NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని... జగన్ సర్కార్ గత వారం రోజుల కింద సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నాయకులు ఏమో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తు ఉంటే... మరి కొంతమంది నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండా నే జిల్లాలను విభజించి వాటికి పేర్లు కూడా పెట్టారని మండిపడుతున్నారు అసంతృప్త నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షంతో పాటు అధికార వైసీపీ పార్టీలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

 ఇలాంటి తరుణంలో టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కు ఊహించని షాక్ తగిలింది. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నేతలు. నందమూరి బాలకృష్ణతో పాటు... పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ మరియు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ నేతలు. ప్రస్తుతం ఈ వివాదం హిందూపురం నియోజకవర్గం లో సంచలనంగా మారిపోయింది. హిందూపురం నియోజక వర్గాన్ని జిల్లా చేసేందుకు తాము పోరాటం చేస్తున్నామని బిజెపి నా యకులు చెబుతున్నారు. కానీ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన నందమూరి బాలయ్య అసలు ఈ వివాదంపై స్పందించడం లేదు అంటూ మండిపడుతున్నారు నాయకులు. నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా హిందూపురం నియోజక వర్గాన్ని జిల్లా చేసేలా ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: