ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్ కలిగిన మొబైల్ ఫోన్ ఏదైనా ఉంది అంటే అది యాపిల్ ఫోన్ అన్న విషయం తెలిసిందే. మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం యాపిల్ నెంబర్వన్ స్థానంలో కొనసాగుతోంది. అదేంటోగాని యాపిల్ ఫోన్ దగ్గర ఉంది అంటే అది ఒక ప్రెస్టేజ్ లా ఫీల్ అవుతూ ఉంటారు ఎంతోమంది. ఇలా యాపిల్ ఫోన్ లో ఉన్న ఫీచర్లు నచ్చినా నచ్చకపోయినా కాస్త లెవెల్ వుంటుందని యాపిల్ ఫోన్ కొనుగోలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మిగతా మొబైల్స్ తో పోల్చి చూస్తే అటు యాపిల్ ఫోన్ ల ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు యాపిల్ ఫోన్ కొనుగోలు చేయడం అనే ఆలోచన కూడా చేయరు.



 అయితే ఇప్పుడు మాత్రం యాపిల్ ఫోన్ కొనుగోలు చేయలేక పోయామే అనే బెంగ అవసరం లేదు. మీకు అందుబాటు ధరలోనే మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే యాపిల్ 13 ఉండే  ఒక ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇక ఈ ఫోన్ తయారు చేసింది ఎవరో కాదు చైనా. సాధారణంగా చైనా ఎన్నో వస్తువులకి డూప్లికేట్ లు తయారు చేస్తూ ఉంటుంది అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఇతర దేశాలలో తయారు చేసినటువంటి వస్తువులకు అచ్చం అలాంటి రూపురేఖలతోనే తయారు చేసి తక్కువ ధరకు అమ్మడం లాంటివి చేస్తూ ఉంటుంది. అందుకే మార్కెట్లో చైనా బ్రాండ్ లు  కాస్త ఎక్కువగానే అమ్ముడు పోతుంటాయ్. ఇప్పుడు ఏకంగా యాపిల్ ఐఫోన్ 13 లాంటి ఫోన్ తయారుచేసింది.



 ఇక ఇప్పుడు చైనా తయారుచేసిన మొబైల్ ఐ ఫోన్ పక్కన పెడితే అసలు ఏది నిజమైన అన్నది కూడా గుర్తించడం చాలా కష్టం అని చెప్పాలి.  అంతలా అచ్చు గుద్దినట్లు గా తయారుచేసింది చైనా. చైనా లో జియోని జీ30 pro అనే పేరుతో ఇక ఈ సరికొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఫ్లాట్ ఫ్రేమ్,కెమెరా మాడ్యూల్,  సెల్ఫీ కెమెరా, నాచ్ సహా అనేక అంశాలు కూడా అచ్చం ఐఫోన్ 13 లాగే ఉన్నాయి. ఇక చైనా విడుదల చేసిన ఈ మొబైల్ 2 వేరియంట్  లలో లభిస్తుండడం గమనార్హం. 6,200, 8200 గా ఈ మొబైల్ ధరలు ఉన్నాయి.  ఈ ఫోన్ భారత్ లోకి కూడా రాబోతుందట. ఐఫోన్  కొనలేక పోయామని బాధపడేవారు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: