విజ‌య‌వాడ‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న13 ఏళ్ల బాలిక ఆత్మ‌హ‌త్య కేసు రాజ‌కీయంగానూ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. విజ‌య‌వాడ విద్యాధ‌ర‌పురం కుమ్మ‌రిపాలెం ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి బాలిక‌ శ‌నివారం కిందికి దూకి ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. వినోద్‌జైన్ అనే వ్య‌క్తి త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డినందునే త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు ఆ బాలిక సూసైడ్ నోట్ రాసిన‌ట్టు ఏసీపీ హ‌నుమంత‌రావు వెల్ల‌డించ‌డంతో స్థానికుల్లో ఘ‌ట‌న‌పైన‌, నిందితుడిపైన‌ తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ బాలిక కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆవేద‌న చెందుతూ నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు నిందితుడిని, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను అదుపులోకి తీసుకోవ‌డంతో అత‌డి ఇంటిని సీజ్ చేసిన‌ట్టు తెలిపారు. నిందితుడైన వినోద్‌జైన్ గ‌తంలో టీడీపీ త‌ర‌పున విజ‌య‌వాడ 37వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌గా పోటీ చేసిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఘ‌ట‌న‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ స‌హా ప‌లువురు నాయ‌కులు స్పందించి ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకుంద‌ని, నిందితుడిని క‌ఠినంగా శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. రోజా టీడీపీ నేత‌ల అరాచ‌కాలకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని కూడా విమ‌ర్శించారు.

 మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కూడా ఘ‌ట‌న‌పై స్పందించారు. టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన కార‌ణంగానే అమాయ‌కురాలైన బాలిక మ‌నోవేద‌న‌తో ఉసురుతీసుకుంద‌ని, నిందితుడిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయ‌న బాలిక కుటుంబ స‌భ్యుల‌ను బంధువుల‌ను ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న వివ‌రాల‌ను తెలుసుకుని వారిని ఓదార్చారు. కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు తెలుసుకున్నార‌ని, ఆ పాప‌కు జ‌రిగిన అన్యాయంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించార‌ని కూడా మంత్రి చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడైన వినోద్‌జైన్ విజ‌య‌వాడ ఎంపీ టీడీపీ నేత కేశినేని నాని ముఖ్య అనుచ‌రుడ‌ని, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అత‌డి త‌ర‌పున ఎంపీ కేశినేని నాని, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారని, అటువంటి వ్య‌క్తుల‌ను పార్టీలో ఉంచుకున్నందుకు ఇప్పుడు చంద్ర‌బాబు, లోకేష్ స‌మాధానం చెప్పాల‌ని మంత్రి వెల్లంప‌ల్లి నిల‌దీశారు. మొత్తంమీద రాజ‌కీయ దుమారంగా మారిన ఈ ఘ‌ట‌న టీడీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేసిందనే చెప్పాలి. దీనిపై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: