క‌రోనా దెబ్బ‌కు కుదేలు అయిన భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కేంద్ర బ‌డ్జెట్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించ‌నుందా అని భార‌తీయులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తూ ఉన్నారు. ఓవైపు అంత‌ర్జాతీయ ప‌రిణామాలు, స‌ర‌ఫ‌రా గొలుసుల విచ్ఛిన్నం ఉత్ప‌త్తి వ్య‌యం పెరుగుద‌ల అన్నీ క‌లిసి దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణానికి దారి తీసాయి. కొవిడ్ కాలంలో జీవ‌నోపాధి కోల్పోయిన కోట్లాది ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డాలంటే దేశం యొక్క ఆర్థికానికి కొత్త ఊపు ఒక‌టి తీసుకురావాలి. ముఖ్యంగా ద్ర‌వ్యోల్భ‌ణాన్ని, ఆర్థికాభివృద్ధిని స‌మ‌తుల ప‌ర‌చుకుంటూ ముందుకు కొన‌సాగాలి. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టే 2022 బ‌డ్జెట్ అంద‌రి ఆశ‌ల‌నూ తీర్చ‌గ‌ల‌దా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌గా మారింది.

క‌రోనా కాలంలో ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే ఆదాయం అంతా ప‌డిపోవ‌డం, వ‌స్తు సేవ‌ల వినియోగం కూడా త‌గ్గిపోయింది. 2022లో వ్య‌క్తిగ‌త వినియోగ వ్య‌యం 6.9 శాతం పెర‌గ‌నున్నా.. 2020తో పోల్చితే 2.90 శాతం త‌క్కువ‌నే చెప్పొచ్చు. ప్ర‌జ‌ల చేతిలో డ‌బ్బు ఎక్కువ ఆడే విధంగా చేస్తే.. వ‌స్తు సేవ‌ల‌కు గిరాకీ పెరుగుతుంది. ప‌న్ను రేట్లు త‌గ్గించ‌డం, ఇంటి నుంచి ప‌ని చేసేవారికి ఇచ్చే భ‌త్యాల‌పై ప‌న్ను మిన‌హాయించ‌డం వంటి చ‌ర్య‌ల మూలంగా వినియోగ‌దారుల చేతిలో డ‌బ్బు ఎక్కువ‌వుతుంది. ఆ డ‌బ్బును వారు వ‌స్తు సేవ‌ల కొనుగోలుకు ఖ‌ర్చు చేస్తుంటారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కొత్త ఊపు తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం ఎక్కువ‌గా నిధులు ఖ‌ర్చు పెట్ట‌డం వ‌ల్ల బ‌డ్జెట్ లోటు, విత్త‌లోటు పెరిగే మాట వాస్త‌వం. కానీ ప్ర‌భుత్వం చేసే వ్య‌యం ఉత్ప‌త్తిని గిరాకీని పెంచేవిధంగా ఉండేలా చూసుకోవ‌డ‌మ‌మే అస‌లు సిస‌లు ప‌రిష్కారం. ఏ రంగాల్లో ఖ‌ర్చు పెడితే ఎక్కువ ఫ‌లితం వ‌స్తుందో ఆ రంగంలోనే ఎక్కువ నిధులు వ్య‌యం చేయాలి.

గ‌త సంవ‌త్స‌రం భార‌త్‌లో శ‌త కోటీశ్వ‌రుల సంఖ్య 102 నుంచి 142కు పెరిగింది. 84 శాతం ప్ర‌జ‌ల ఆదాయాలు దారుణంగా క్షీణించాయ‌ని వెల్ల‌డించిన‌ది. విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు సామాన్యుల జీవితాలు అత‌లాకుత‌ల‌మ‌వుతుంటే.. సంప‌న్నుల సంప‌ద‌లో ఉన్న‌త శిఖరాల‌కు ఎగ‌బాకుతున్నారు. 2020 మార్చిలో రూ.23.14 ల‌క్ష‌ల కోట్లకు పెరిగిపోయింది. ఈ కాలంలో 4.6 కోట్ల భార‌తీయులు దుర్భ‌ర దారిద్ర్యంలోకి జారీపోయారు. దేశంలోని ధ‌నికుల‌పై ఈ బ‌డ్జెట్ సంప‌ద ప‌న్ను విధించే విష‌యం ఆలోచించాలి. దీని ద్వారా వ‌చ్చే మొత్తాల‌ను సామాన్యుల జీవితాల‌ను మెరుగు ప‌ర‌చ‌డానికి వెచ్చించ‌వచ్చు. ముఖ్యంగా దేశ శ్రామిక బ‌ల‌గంలో 80 శాతం వ్య‌వ‌సాయం, ఎంస్ఎంఈ రంగాల్లోనే ప‌ని చేస్తున్నారు. ఈ రెండు రంగాల‌ను పున‌రుద్ధ‌రిస్తే.  యావ‌త్ దేశం యొక్క ఆర్థికంగా మ‌ళ్లీ పుంజుకుంటుంది. ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌కు ముడి స‌రుకులు నిరాట‌కంగా అందేవిధంగా చూడ‌టం ద్వారా దేశ ఆర్థికాన్ని త్వ‌ర‌గా అభివృద్ధి ప‌థంలోకి న‌డిపించ‌వ‌చ్చు. ముఖ్యంగా ఎక్కువ ఉత్త‌రాది రాష్ట్రాల‌పైనే ప్ర‌ధాని న‌రేంద్ర మోది ఆస‌క్తి క‌న‌బ‌రుచుతున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయా ప్ర‌భుత్వాలు తెగేసి చెబుతున్నా అవేమి ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం. అదేవిధంగా ఇప్పుడు 5 రాష్ట్రాల‌కు ఎన్నికలు స‌మీపిస్తుండ‌టంతో ఈసారి కూడా ఉత్త‌రాది రాష్ట్రాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జేట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి మ‌రీ.



మరింత సమాచారం తెలుసుకోండి: