పీఆర్సీ సాధ‌న స‌మితి,  ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య క్ర‌మంగా దూరం పెరుగుతున్న‌ది. పీఆర్‌సీ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని పేర్కొంటున్నారు నేత‌లు. చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌డానికి కూడా ష‌ర‌తులను పెడుతున్నారు. ఈ త‌రుణంలో సంచ‌ల‌న కామెంట్లు చేసారు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు. ఐఎఎస్‌ల‌పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మేము ఈ నెల 25న సంప్ర‌దింపుల క‌మిటీతో మా స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుల చ‌ర్చ‌ల‌కు వెళ్లి మా లేఖ‌ను ఇచ్చి వ‌చ్చాం అని.. మేము పెద్ద కోరిక‌లు ఏమి అడుగ లేదు అని పేర్కొన్నారు.

ముఖ్యంగా పీఆర్‌సీ సాధ‌న స‌మితి ప్ర‌తినిధి బండి శ్రీ‌నివాస్ కానీ అశుతోష్ మిశ్రాక‌మిటీ నివేదిక‌లో ఏమి ర‌హ‌స్యం ఉంది. ఎందుకు బ‌య‌ట పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓలు 70 శాతం మేర‌కు బిల్లులు ప్రాసెస్ చేయ‌లేద‌న్న ఆయ‌న ఉద్యోగుల‌పై ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం బేష‌జాల‌కు పోతుంది. జీతాలు, పీఆర్‌సీ ప్ర‌తి దాంట్లోనూ క‌న్ప్యూజ‌ర్ ఉంద‌ని.. సీఎం వైఎస్ జ‌గ‌న్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

ఇక నిర్బంధ వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని మండిప‌డ్డారు. పీఆర్‌సీ సాధ‌న స‌మితి ప్ర‌తినిధి సూర్య‌నారాయ‌ణ డీడీఓలు, ట్రెజ‌రీ ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం అని మెమోలు జారీ చేయ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు.  క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘిస్తేనే చ‌ర్య‌లు తీసుకోవాలి త‌ప్ప్, కోపం వ‌స్తే చ‌ర్య‌లు తీసుకోవ‌డం కుద‌ర‌దు అన్నారు. మ‌రొక‌వైపు ఏపీలో కొంద‌రూ ఐఏఎస్‌లు మితిమీరి ప్ర‌వ‌ర్తిస్తున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. సూర్య‌నారాయ‌ణ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఐఏఎస్ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. వారిపై అవ‌స‌రం అయితే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం అని హెచ్చ‌రించారు.

ఎస్ఆర్ లేకుండా పే ఫిక్సేష‌న్ చేయ‌లేరు. అదేవిధంగా ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ వ‌ద్దు అని రిక్వెస్ట్ లెట‌ర్లు ఇచ్చారు అని గుర్తు చేసారు. సాంకేతికంగా చూస్తే డీడీఓలు, ట్రెజ‌రీ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేర‌ని స్పష్టం చేసారు. ఎవ‌రి మీద‌న్నా చర్య‌లు తీసుకుంటే.. పీఆర్‌సీ సాధ‌న స‌మితి అండగా ఉంటున్న‌ద‌ని ప్ర‌క‌టించారు. పీఆర్‌సీ సాధ‌న స‌మితి త్వ‌ర‌లోనే లీగ‌ల్ సెల్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. కొత్త పే స్కేళ్ల ప్ర‌కారం.. జీతాలు వ‌స్తే పే స్లిప్పుల‌ను ద‌హ‌నం చేసి నిర‌స‌న తెలుపుతాం అని సూర్య‌నారాయ‌ణ‌ ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: