పార్ల‌మెంట్ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే బ‌డ్జెట్ సెష‌న్ తొలిరోజు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి మ‌ధ్య కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, స‌మాజ్ వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ మ‌ధ్య పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ది. సోమ‌వారం బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ములాయం సింగ్ యాద‌వ్ పార్ల‌మెంట్ మెట్లు దిగుతుండ‌గా.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ  వ‌చ్చారు.


ములాయం సింగ్ యాద‌వ్‌ను చూడ‌గానే ముకుళిత హ‌స్తాల‌తో అత‌ని వైపు క‌దిలిన స్మృతి ఇరానీ వంగి అత‌నికీ న‌మ‌స్కారం చేసింది. అంతేకాదు ములాయం పాదాల‌ను మొక్కారు స్మృతి ఇరానీ. దీంతో ములాయం ఆమె త‌ల‌పై చేయి వేసి ఆశీర్వ‌దించారు.  ఇక‌ త‌రువాత ములాయం నిచ్చెన దిగ‌డానికి ఇరానీ నిల‌బ‌డి వేచి ఉన్నారు.  యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీ, స‌మాజ్‌వాదీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుండ‌గా.. పార్ల‌మెంట్ నుంచి వ‌చ్చిన ఈ ఫొటో వార్త‌ల‌లో నిలుస్తున్న‌ది.



అదేవిధంగా కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రి ముఖ్ఖార్ అబ్బాస్ స‌ఖ్వీ కూడా పార్ల‌మెంట్ లో  స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే ఇరువురు నేత‌లు అలా కాసేపు మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. ఇది కాకుండా ఇరానీ యొక్క మ‌రొక చిత్ర‌ము బ‌య‌ట ప‌డిన‌ది. అందులో ఆమె ఒక‌సారి కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీని చూస్తున్న‌ట్టు కూడా క‌నిపించింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య  ఎటువంటి మాట‌లు లేవు. ఇద్ద‌రు నేత‌లు లోక్‌స‌భ మెట్ల‌పై వేరువేరుగా నిల‌బ‌డి ఉన్నారు. ఒక వైపు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ప‌క్క‌న రాహుల్‌గాంధీ నిల‌బ‌డి ఉండగా.. స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీతో మాట్లాడుతున్నారు. ఇలా చాలా వ‌ర‌కు ఇవ్వాళ ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: