వ‌చ్చే 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ కోసం అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బ‌డ్జెట్ కోసం పార్ల‌మెంట్ స‌మావేశాలు నిన్న సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. ఇవాళ బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. వ‌రుస‌గా నాలుగ‌వ సారి నిర్మ‌ల సీతారామ‌న్ పెట్ట‌నున్నారు. ముఖ్యంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు వ‌ల్ల వాహ‌న‌దారుల‌కు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్న విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఎక్సైజ్ డ్యూటిని త‌గ్గించింది. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విష‌యం తెలిసిన‌దే.

కేంద్ర ప్ర‌భుత్వం ఆదాయం భారీగా పెరిగిన‌ది. అయితే అదే స‌మ‌యంలో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు యొక్క ధ‌ర‌లు కూడా బాగానే పెరిగాయి. దీంతో ప్ర‌భుత్వం వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవాలంటే ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌క‌పోవ‌చ్చ‌ని బ్యాంకు ఆఫ్ బ‌రోడా చీఫ్ ఎకాన‌మిస్ట్ మ‌ద‌న్ స‌బ్న‌వీస్ భాస్క‌ర్ నివేదిక అంచ‌నా వేస్తున్న‌ది. మ‌రొక‌వైపు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో ఆర్థిక స‌ర్వేను స‌మ‌ర్పించారు. అయితే ఈ స‌ర్వే ప్ర‌కారం.. 2022-23లో జీడీపీ  ఆర్థిక వృద్ధి రేటు 8-8.5% అంచ‌నా వేసారు. 2021-22 వృద్ధి అంచ‌నా కన్న 9.2% త‌క్కువ‌. ముఖ్యంగా వ్యాక్సిన్ క‌వ‌రేజ్ స‌ర‌ఫ‌రా వైపు సంస్క‌ర‌ణ‌లు వృద్ధికి తోడ్ప‌డుతాయ‌ని ఆర్థిక స‌ర్వే పేర్కొన్న‌ది.

క‌రోనా మ‌హ‌మ్మారి మూలంగా ఆర్థిక కార్య‌క‌లాపాలు ఏవీ ప్ర‌భావితం కావు. రుతుప‌వ‌నాలు కూడా సాధార‌ణంగా ఉంటాయ‌నే ఊహ ఆధారంగా ప్ర‌భుత్వం జీడీపీ అంచ‌నా వేసింది. అన‌గా రుతుప‌వ‌నాల ప్ర‌భావం లేదా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ తీవ్రంగా ప్ర‌భావం చూపిస్తే.. అప్పుడు జీడీపీ త‌గ్గొచ్చు. ఇవాళ ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ లో కేంద్ర ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల‌కు తీపి క‌బురు అందించే అవ‌కాశాలున్నాయ‌ని కొంత‌మంది నిపుణులు భావిస్తున్నారు. మ‌రొక‌వైపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్రం పెట్రోల్‌, డీజిల్ సుంకాల‌ను కూడా త‌గ్గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ నిర్ణ‌యం తీసుకుంటే వాహ‌న‌దారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరే అవ‌కాశ‌ముంది. మోదీ  ప్ర‌భుత్వం ఈ బ‌డ్జెట్‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో మ‌రికొద్ది సేపు వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: