ఓ వైపు క‌రోనా, ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి వెంటాడుతుంటే.. మ‌రొక‌వైపు ఆర్థిక స‌వాళ్లు.. ఇలా పోర్చుగ‌ల్‌లోని సోష‌లీస్ట్ పార్టీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మూడ‌వ‌సారి విజ‌యంప‌ర‌ప‌ర దూసుకెళ్లుతుంది. కొవిడ్‌, ఒమిక్రాన్ కేసుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పోర్చుగ‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆదుకునేందుకు యూరోపియ‌న్ యూనియ‌న్ వంద‌ల కోట్ల యూరోల స‌హాయాన్ని అందించేందుకు సిద్ధం అవుతుంది. ఈ త‌రుణంలోనే సోష‌లిస్ట్ పార్టీ మ‌రొక‌మారు విజ‌యం సాధించ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. 230 సీట్లు ఉన్న పార్ల‌మెంట్‌లో సోష‌లీస్టులు ఇప్ప‌టికే 106 సీట్ల‌ను సాధించుకున్నారు. కొన్ని సీట్లు వ‌చ్చిన‌ట్ట‌యితే పూర్తి మెజార్టీ సాధ్య‌మ‌వుతుంది.

పోర్చుగ‌ల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 98.5 శాతం లెక్కించ‌గా ఇందులో సోష‌లిస్టులు 41 శాతం ఓట్లు సాధించారు. సోష‌లిస్టుల ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి సెంట‌ర్ రైట్ సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీకి 28 శాతం ఓట్లు సాధించింది.  65 పార్ల‌మెంట‌రీ స్థానాల‌ను గెలుచుకుంది ఈ పార్టీ. దేశంలోని రూ.1.08 కోట్ల అర్హులైన ఓట‌ర్ల‌లో ఈ ద‌ఫా విదేశాల్లో నివ‌సిస్తూ.. మెయిల్ ద్వారా ఓటు వేసే 15 ల‌క్ష‌ల మందిని అంగీక‌రించ‌నేలేదు. మ‌రొక‌సారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. ప్ర‌ధాని ఆంటినో కోస్టా. భార‌త ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు కూడా చెప్పారు. పోర్చుగ‌ల్‌లో బ‌ల‌మైన బంధాన్ని కావాల‌ని భార‌త్ కోరుకుంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం 106 సీట్లు తెచ్చుకున్న సోష‌లిస్టు పార్టీ కొన్ని చిన్న పార్టీల సహాయం కూడా తీసుకుంటుంద‌ని భావిస్తున్నారు.

ముఖ్యంగా కీల‌క సంక్షోభ స‌మ‌యంలో కొత్త ప్ర‌భుత్వంపై అంచ‌నాలు ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని చెప్పాలి. పేద దేశం అయిన పోర్చుగ‌ల్ ఈయూ 5000 కోట్ల డాల‌ర్ల సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన‌ది. వీటిలో ఎక్కువ భాగం మౌలిక స‌దుపాయాల కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్ర‌యివేటు కంపెనీల‌కు అందిస్తారు. 2015 సోష‌లిస్ట్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. బ‌డ్జెట్‌ను ఆమోదింప చేసుకునేందుకు మిత్ర‌ప‌క్షాలు అయిన లెప్ట్ బ్లాక్‌, పోర్చుగీస్ క‌మ్యూనిస్ట్ పార్టీల‌పై సోష‌లిస్ట్ పార్టీ ఆధారప‌డుతున్న‌ది. సోష‌లిస్ట్ పార్టీతో పాటు దేశంలో ఈసార చేగా అనే పార్టీ సత్తాను చాటింది. మూడేండ్ల  క్రిత‌మే దేశంలో ఆవిర్భ‌వించిన ప్ర‌జాక‌ర్ష‌క, జాతీయ వాద పార్టీ చేగా ఈ ఎన్నిక‌ల్లో 5-8 శాతం ఓట్ల‌ను సాధించిన‌ది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ పార్టీ కేవ‌లం ఒక్క సీటు సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో 46-51 శాతం మ‌ధ్య పోలింగ్ న‌మోదు అయింది. గ‌తంలో కంటే పోలింగ్ శాతం త‌గ్గిన‌ది. సోష‌లిస్ట్ పార్టీ క‌రోనా స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించినందుకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొంటున్న‌ట్టు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: