ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మె సైర‌న్ మోగించారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే ఫిబ్ర‌వ‌రి 6న అర్థ‌రాత్రి నుంచి స‌మ్మెలోకి వెళ్ల‌నున్న‌ట్టు ఆర్టీసీ సంఘాలు ఐక్య‌వేదిక ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆర్టీసీ ఎండీకీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య‌వేధిక 45 స‌మ‌స్య‌ల‌తో కూడిన మెమొరండంను అంద‌జేసిన‌ది. మెమొరండంపై ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డ‌బ్ల్యూఎఫ్‌, కార్మిక ప‌రిష‌త్ ఉన్నాయి. త‌మ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కార్మిక సంఘాల నేత‌లు అధికారుల‌ను కోరారు.

ఆర్టీసీ ఎండీ ద్వార‌క తిరుమ‌ల‌రావును క‌లిసి స‌మ్మె విష‌యంపై మెమొరండం అందించిన‌ట్టు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య‌వేదిక నేత‌లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కుంటున్న 45 స‌మ‌స్య‌ల‌తో కూడిన మెమొరండాన్ని ఎండీకి అందించామ‌న్నారు. త‌మ స‌మ‌స్య‌లు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని మెమొరండంలో డిమాండ్ చేసారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని ప‌క్షంలో రాష్ట్రవ్యాప్తంగా స‌మ్మెకు వెళ్తామ‌ని ఎండీకీ వివ‌రించారు. ఇప్ప‌టికే ఉద్యోగులు ప్ర‌భుత్వం మ‌ధ్య పీఆర్‌సీ ర‌గ‌డ కొన‌సాగుతుంది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త పీఆర్‌సీనీ ఉద్యోగులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. పీఆర్‌సీ జీవోల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. మ‌రొక‌వైపు ప్ర‌భుత్వం కూడా ప‌ట్టుద‌ల‌గా ఉంది.

ఈ త‌రుణంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికే స‌మ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రి 06వ తేదీ అర్థ‌రాత్రి నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకి వెళ్లుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. తాము కూడా స‌మ్మెలోకి వెళ్లుతున్న‌ట్టు వెల్ల‌డించారు. రాష్ట్రంలో పీఆర్‌సీ వివాదం మ‌రింత‌గా ముదిరిన‌ది. ఉద్యోగ సంఘాలు ప‌ట్టును వీడ‌డ‌ము లేదు. ప్ర‌భుత్వం మెట్టు దిగ‌డం లేదు. పాత జీతాల‌ను కావాల‌ని ఉద్య‌గో సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే.. కొత్త పీఆర్‌సీ ప్ర‌కారం.. జీతాలు అని ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు నిర‌వ‌ధిక స‌మ్మెకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ముఖ్యంగా నాలుగు సంఘాల‌తో కూడిన పీఆర్‌సీ సాధ‌న స‌మితి జ‌న‌వ‌రి 24న స‌మ్మె సైర‌న్ మ్రోగించిన‌ది. అయితే ఉద్య‌మంలో భాగంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయులు ర్యాలీలు, నిర‌స‌న‌లు, ధ‌ర్మాలు, రిలే నిర‌హార దీక్ష‌లు చేప‌ట్టారు. మ‌లిద‌శ ఉద్య‌మానికి సై అన్న ఉద్యోగ సంఘాలు స‌ర్కార్‌తో స‌మ‌రానికి ఢీ అంటే ఢీ అంటూ ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 03న ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: