ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ది. కొత్త కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. సోమ‌వారం న‌మోదు అయిన కేసుల‌తో పోల్చితే ఇవాళ కొత్త కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌కు 6,213 కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రొక 5 మంది క‌రోనాతో చ‌నిపోయారు. గ‌డిచిన 24  గంట‌ల్లో 10,795 క‌రోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 1,05,930 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 35,053 మందికి కోవిడ్ ప‌రీక్ష‌లు చేసారు. తాజాగా న‌మోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా కృష్ణా జిల్లాలో 679 క‌రోనా కేసులు వెలుగు చూసాయి. సోమ‌వారం 5,879 క‌రోనా కేసులు న‌మోదు అవ్వ‌గా మంగ‌ళ‌వారం ఆ సంఖ్య పెరిగింది.

మ‌రొవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. రోజువారి కేసుల న‌మోదులో భారీ త‌గ్గుద‌ల క‌నిపిస్తున్న‌ది. 2ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గా రోజువారి కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో మ‌రొక 1,192 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,96,242 కు పెరిగిన‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,54,076 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నూత‌నంగా న‌మోదు అయిన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్క‌వ‌గా ఉండ‌డం ఊర‌టను ఇచ్చే అంశం. రిక‌వ‌రీ రేటు 94.60 శాతానికి మెరుగుప‌డిన‌ది. మ‌రొక వైపు రోజువారి పాజిటివిటి రేటు 11.69 శాతంగా ఉన్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 1,66,68,48,204 డోస్‌ల వ్యాక్సిన్ వేసారు.

మ‌రొక వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ప్యూను ప్ర‌భుత్వం పొడిగించింద‌ని ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు నైట్ క‌ర్ప్యూను పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ప్యూ కొన‌సాగ‌నున్న‌ది. ప్ర‌భుత్వం జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు నైట్ క‌ర్ప్యూ విధించిన‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల త‌రుణంలో నైట్ క‌ర్ప్యూను పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న‌ది. మాస్క్ ధ‌రించ‌ని వారికి రూ.100 జ‌రిమానా విధిస్తారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. థియేట‌ర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ కొన‌సాగున్న‌ది. సినిమా హాళ్ల‌లో సీటు వ‌దిలి సీటు విధానాన్ని పాటిస్తూ.. ప్రేక్ష‌కులంద‌రూ మాస్క్ ధ‌రించాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: