ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది చైనా. భారత భూభాగాన్ని ఆక్రమించుకుని ఆధిపత్యాన్ని సాధించాలి అని అనుకుంది. సరిహద్దు ల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే భారత్ భయపడి పోయి వెనక్కి తగ్గుతుంది అని పగటి కలలు కనింది. కానీ సరిహద్దు లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.  భయ పడుతుంది అనుకున్న భారత్ ఎదురు తిరిగింది. చైనాకు కు ఊహించని షాక్ తగిలింది.. అయితే గత కొన్ని నెలల నుంచి సరిహద్దు ల్లో ఉద్రిక్త పరి స్థితులు మాత్రం అదే విధం గా కొన సాగుతున్నాయి..



 ఇదే సమయం లో అటు సరిహద్దుల్లో చైనాకు ధీటుగా బదులిస్తోన్న భారత్ మరో వైపు నుంచి ఆర్థిక యుద్ధం చేస్తూ ఉండడం గమనార్హం. గత కొంత కాలం నుంచి చైనాకు సంబంధించిన అన్ని వస్తువులకు కూడా నిషేధం విధిస్తూ వచ్చింది భారత్. ప్రపంచం లోనే అతి పెద్ద మార్కెట్ కలిగిన భారత్ నుంచి చైనా వరుస నిషేధాలు ఎదుర్కొంటూ ఉండడం తో ఎన్నో కోట్ల నష్టం కూడా వాటిల్లింది. కేవలం వస్తువులను దిగుమతి నిలిపి వేయడమే కాదు అటు చైనా కు సంబంధించిన యాప్స్ అన్నింటిపై కూడా నిషేధం విధించింది.



 ఈ క్రమం లోనే టిక్ టాక్, పబ్జి లాంటి ఎన్నో ఫేమస్ యాప్స్ భారత ప్రభుత్వ నిషేధానికి గురి కావడం గమనార్హం.  ఇక మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం మరి కొన్ని చైనా యాప్స్ పై నిషేధం విధించింది అన్నది తెలుస్తుంది. దాదాపు మరో  55 చైనా నిషేధం విధించారట. ఈ యాప్స్ అన్ని కూడా భారత్లోని పౌరుల పర్సనల్ డేటాని దొంగ లిస్తున్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించడం తో ఈ నిర్ణయం తీసుకుంది భారత్. భారత్ నిర్ణయం తో చైనాకు మరో సారి ఊహించని షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: