ఏంటి ఈ సారి కొడాలి నాని గుడివాడలో గెలుస్తారా? అబ్బే ఈ సారి నానికి గెలవడం కష్టమే...ఇంతవరకు అంటే ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పనులు చేయలేకపోయారు..కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మంత్రి అయినా సరే గుడివాడకు చేసింది ఏమి లేదు..పైగా బూతులతో నెగిటివ్ అయిపోతున్నారు...ఏదేమైనా ఈ సారి గుడివాడలో కొడాలి గెలవడం కష్టమే అని...గుడివాడ ప్రజల్లో చర్చ నడుస్తోంది...టీడీపీకి అనుకూలంగా ఉండేవారు, న్యూట్రల్ వర్గాలు.. మాత్రం కొడాలి ఈ సారి గెలవరని చెప్పుకుంటున్నారు.

వైసీపీ వర్గం మాత్రం గుడివాడలో కొడాలి గెలుపు ఆపేది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు..అసలు కొడాలిని ఓడించే దమ్ము ఎవరికి లేదని అంటున్నారు. ఇది వైసీపీ వర్గాల్లో ఉన్న చర్చ..కాకపోతే కొందరు వైసీపీ కార్యకర్తలు కొడాలి గెలుపు విషయంలో లోలోపల భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే గుడివాడలో కొడాలికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది...పేద, మధ్యతరగతి వర్గాలు కొడాలి వైపే ఉంటాయి....బీసీ, ఎస్సీ, కాపు వర్గాలు సైతం కొడాలికే సపోర్ట్.

అందుకే ఇక్కడ వరుసగా కొడాలి విజయం సాధిస్తూ వస్తున్నారు...కానీ ఈ సారి కాస్త పరిస్తితి మారుతుంది...అధికారంలోకి వచ్చాక కొడాలి వైఖరి మారింది...తన శాఖకు సంబంధించి ఏ పనులు చేస్తున్నారో తెలియదు గాని...మీడియా ముందుకొస్తే బూతులు మాట్లాడుతున్నారు.. ఇలా బూతులు మాట్లాడటం వైసీపీ వీరాభిమానులకు బాగానే ఉంటుంది గాని, కాస్త ఆలోచించేవారికి మాత్రం నచ్చడం లేదు. అబ్బే కొడాలి నాని అలా మాట్లాడకూడదని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకునే పరిస్తితి వచ్చింది.

రాజకీయంగా విమర్శలు చేస్తే బాగానే ఉండేది గాని..ఇలా వ్యక్తిగతంగా తిట్టడం కరెక్ట్ కాదని కొందరు వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. పైగా మంత్రిగా ఉండి కూడా గుడివాడలో అనుకున్న మేర అభివృద్ధి పనులు చేయలేకపోయారనే అసంతృప్తి కూడా ఉంది...అందుకే ఈ సారి కొడాలి విజయంపై సొంత పార్టీ వాళ్ళకే డౌట్ ఉంది. కానీ గుడివాడలో రాజకీయ పరిస్తితులని చూస్తే....కొడాలి స్ట్రాంగ్‌గా ఉన్నారు...టీడీపీ చాలా వీక్‌గా ఉంది..కాబట్టి టీడీపీ వల్ల కొడాలి మళ్ళీ గెలిచే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి ఈ సారి గుడివాడలో ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: