ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి టిడిపి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత  రచ్చ  నడుస్తోంది. ఒకరినొకరు ద్వేషించుకొంటూ మాటలు తూటాలుగా పేల్చుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడు తున్నాయి. ఇక రేషన్ బియ్యం పై రచ్చ మాత్రం ఫిక్ స్టేజ్ కి  చేరుకుంది. మరి ఏం జరిగిందో తెలుసుకుందామా..? ఆంధ్ర ప్రదేశ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై  టిడిపి నాయకులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ద్వారంపూడిలపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రంగా విమర్శలు చేశారు. మంత్రి కొడాలి నాని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కలిసి  పేదలకు పంపిణీ చేసేటటువంటి  రేషన్ బియ్యాన్ని కొల్లగొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అక్కడ గోడౌన్ నుంచి రేషన్ బియ్యాన్ని దోచుకుని కాకినాడలోని కోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికా  ఐవరీ కోస్ట్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. వారు రేషన్ దుకాణాల వ్యవస్థను నిర్వీర్యం చేసి పేద ప్రజల కడుపు మీద కొడుతున్నారని అన్నారు. ద్వారంపూడి, మంత్రి కొడాలి నాని రాష్ట్రం పై పడి పందికొక్కుల్లా తింటున్నారని హెచ్చరించారు. ప్రతి ఏటా 5 వేల కోట్ల రూపాయల విలువైన పేద ప్రజల బియ్యాన్ని దోచుకు తింటున్నారని ఆరోపణ చేస్తున్నారు. దొంగ బియ్యం వ్యాపారంలో మంత్రి కొడాలి నానికి ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తు భాగస్వామ్యాన్ని తెలియజేశారు.

 బియ్యం అక్రమ రవాణా మీదనే ద్వారంపూడి కుటుంబం బ్రతుకు తోందని  తెలిపారు. కాకినాడ పోర్టు నుండి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాన్ బాస్మతి రకం 18 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేవని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో  31 లక్షల టన్నుల పైబడి బియ్యం ఎగుమతి  అవుతోందని ఆరోపించారు. ద్వారంపూడి, కొడాలి నాని కలిసి బియ్యాన్ని కొల్లగొడుతున్నారు కాబట్టే దేశంలో ఏ పోర్టు నుంచి లేని విధంగా బియ్యం ఎగుమతులు కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్నాయి. అలా క్రమంగా దోచుకొని ఎగుమతి చేసుకున్న బియ్యాన్ని వెస్ట్ ఆఫ్రికా లోని ఐవరీ కోస్ట్ కు తరలిస్తున్నారని విమర్శించారు పట్టాభి.

మరింత సమాచారం తెలుసుకోండి: