తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చినజీయర్ స్వామికి విబేధాలు వచ్చాయా.. చిన జీయర్ స్వామి తీరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారా.. అందుకే సీఎం కేసీఆర్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి కేంద్రం వైవే చూడటం లేదా.. ఆయనే కాదు.. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎవరినీ సమతా మూర్తి కేంద్రం వైపు వెళ్లొద్దని ఆదేశించారా.. కేసీఆర్‌ చేతిలో ఉన్న మీడియా సంస్థలు.. సమతామూర్తి కేంద్రం వార్తలను బహిష్కరించాయా... ఈ అనుమానాలు.. దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.


ప్రముఖ దిన పత్రిక ఎండీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి మధ్య విబేధాల గురించి తన పత్రికలో బాగానే రాస్తున్నారు. మొదటి నుంచి చినజీయర్ స్వామికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన అంటే మండిపడుతున్నారని రాధాకృష్ణ రాసుకొచ్చారు.
అయితే.. అంత కోపం ఉందో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం సమతా మూర్తి కేంద్రం వైపు చూడటం లేదు. అసలు ఈ సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభానికి ముందు స్వయంగా కేసీఆరే హడావిడి చేశారు. కానీ ఇప్పుడు అటువైపు రావడం లేదు.


ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి కేసీఆర్‌తో విబేధాలు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి కేసీఆర్ నుంచి పూర్తి సహకారం ఉందన్నారు.
ఉత్సవాలకు అవసరమైన అన్ని వసతులను సీఎం కేసీఆర్ కల్పించారని చినజీయర్ గుర్తు చేశారు. చెప్పారు. ఇవాళ్టి కల్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించామని చినజీయర్ స్వామి చెప్పారు.


సీఎం కేసీఆర్‌ మొదటిరోజు ఇక్కడికి వచ్చినప్పుడే తాను మొదటి సేవకుణ్ని చెప్పారని చినజీయర్ గుర్తు చేశారు. సీఎం కార్యక్రమాలు, ఆరోగ్యం వల్ల రావడానికి అవకాశం దొరక్కపోయి ఉండవచ్చని చినజీయర్ అన్నారు. అంతమాత్రానికే విభేదాలు అని ప్రచారం చేయడం సరికాదన్నారు. లేని విబేధాలు సృష్టించి మంచి వాతావరణానికి పాడు చేయవద్దని చినజీయర్ స్వామి అన్నారు. కేసీఆర్ నుంచి ఎప్పుడూ మద్దతు ఉందని.. రాజకీయ రంగు పులమవద్దని అన్నారు. కేసీఆర్‌తో విభేదాలు ఉంటే.. ఉత్సవాలకు విద్యుత్తు, భగీరథ నీళ్లు, పోలీసు బందోబస్తు లేకపోయేవని స్వామి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: