నరేంద్రమోడీకి హనీమూన్ పీరియడ్ అయిపోయినట్లుంది. రెండోసారి ప్రధానమంత్రి కాగానే కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యర్ధులు పెరిగిపోతున్నారు. పార్టీ మీద కూడా పట్టు జారిపోతోంది. పార్లమెంటు సమావేశాలకు ఎంపీలందరు తప్పకుండా హాజరు కావాలన్న మోడీ ఆదేశాలను చాలామంది పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే ఎన్డీయే భాగస్వామి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మోడీకి గట్టి షాక్ తప్పేలా లేదు.





కారణం ఏమిటంటే నరేంద్రమోడీ సర్కార్ పై నితీష్ బాగా మంటగా ఉందట. బీహార్లో కులగణన చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని కేంద్రప్రభుత్వం తిప్పికొట్టింది. బీహార్ రాజకీయాల్లో కులాల ఆధిపత్యం చాలా ఎక్కువ. కాబట్టి కులగణన జరిగితే కానీ కులాల వారీ లెక్కలు తేలదు. అందుకనే చాలా కాలంగా సీఎం నితీష్ కుమార్ కులగణన జరగాలని పట్టుదలగా ఉన్నారు. దీన్ని కేంద్రం అడ్డుకుంటోంది.





ఒకసారి కులగణనకు అనుమతిస్తే దాని ప్రభావం మిగిలిన రాష్ట్రాలో కూడా పడుతుందని బీజేపీ భయపడుతోంది. దేశవ్యాప్తంగా కులగణన జరిగితే అది బీజేపీకి నష్టమని కమలంపార్ఠీ అగ్రనేతలు ఆందోళనలో ఉన్నారు. అందుకనే బీహార్లో కులగణను అడ్డుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను నితీష్ భేటీ అయ్యారు. వీళ్ళద్దరు చాలాకాలంగా దూరంగా ఉంటున్నారు. అలాంటిది హఠాత్తుగా నితీష్ ను పీకే భేటీ అవటమంటే మామూలు విషయం కాదు.




ఒకవైపు ముంబాయ్ లో మహారాష్ట్ర సీఎంను ఉధ్థవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత  శరద్ పవార్ తో  కేసీయార్ భేటీ అయ్యారు. వీళ్ళందరితోను పీకేకి మంచి సంబంధాలున్నాయి. ఇదే సమయంలో నరేంద్రమోడీ వ్యతిరేకులందరినీ కలపటానికి పీకే ప్రయత్నాలు చేస్తున్నారు.  2014 ఎన్నికల్లో మోడీ-పీకే కలిసే పనిచేశారు. ప్రధానమంత్రి అవ్వగానే పీకేని మోడీ దూరంపెట్టేశారు. తాజాగా నితీష్-భేటీ జరగటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే నితీష్ ఎన్డీయేలో నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. అదే జరిగితే మోడీకి పెద్ద షాకనే చెప్పాలి. బహుశా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నితీష్ నిర్ణయం తీసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: