కేసీఆర్ ఫ్రంట్ రాజకీయాలు మొదలు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తెచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ వేదిక అవసరమని వెల్లడించిన కేసీఆర్ మరోసారి ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా ముంబై టూర్ తో ఆ ప్రయాణం ప్రారంభమైంది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్, పవార్ తో ముంబైలో భేటీ అయ్యారు. మరోవైపు తమ యు.పి.ఏ కూటమి నుంచి పార్టీలు చేజారిపోకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అలర్ట్ అయ్యారు. పార్టీలు చెడిపోకుండా బలహీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. అయితే సాధారణ ఎన్నికల రెండు సంవత్సరాల టైం ఉండగానే దేశవ్యాప్తంగా రాజకీయాలన్నీ వేడెక్కాయి.

 బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములు చాలా యాక్టివ్ గా ఉన్నాయి. మరోవైపు థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత అది అటకెక్కింది. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ వేదిక అవసరమని కేసీఆర్ చెబుతున్నారు. దీని కోసమే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముంబై టూర్ తో మొదలుపెట్టి నా ప్రయాణం రానున్న కాలంలో ఊపందుకోనున్నాయి. కొత్త ఫ్రంట్ లో చేరే పార్టీలు ఏవి..? ఇప్పుడున్న ఫ్రంట్లలో చీలికలు ఉంటాయా. అనేది సమీప భవిష్యత్తులో తెలనున్నది. 2014 ఎన్నికలే లక్ష్యంగా దోచుకుంటున్న ఈ పరిణామాలు రానున్న కాలంలో మలుపులు తీసుకోనున్నాయి.

బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం  చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యూహలు రచిస్తున్నారు. గుణాత్మక మార్పు సమూల పరివర్తన ప్రజల కేంద్రంగా పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని  భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. త్వరలో మళ్లీ భేటీ కానున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత ముంబైలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇలా ఇతర పార్టీల సీఎంలతో, అధ్యక్షులతో మాట్లాడుతూ ఫ్రంటు విజయం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: