దేశ రాజకీయాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం దారి తప్పుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభం చేసిన సంగతి మనందరికీ విధితమే. అయితే ఈ ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభలో మాట్లాడారు. దేశాన్ని సెట్ రైట్ చేయడానికి జాతీయ రాజకీయాలు లో ముందుకు వెళ్తానని.. దేశము దారి తప్పి పోతుందని వెల్లడించారు. అసహ్యం పుట్టే పనులు మన భారత  దేశంలో జరుగుతున్నాయని వివదాస్పద వ్యాఖ్యలు చేశారు కెసిఆర్.  బెంగళూరు లో జరుగుతున్న మత కల్లోలాలు తో పిల్లలు అక్కడ చదవాలంటే  భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. 

 ఏడేళ్లు గా కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదని నిప్పులు చెరిగారు.  అన్నీ రాష్ట్రాలు బాగా ఉండాలంటే కేంద్రంలో ధర్మం తో ఉన్న ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  ప్రజలు కి చేటు అయినది బండ కేసి కొడుతామని హెచ్చరికలు జారీ చేశారు. దేశానికి మార్గ దర్శనము తెలంగాణ రాష్ట్రం అని ఓ రేంజ్ లో కొనియాయదారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మన పథకాలు ను మెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  ప్రాజెక్ట్ గురించి కనీస అవగాహన లేని కొన్ని చిల్లర రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. భారత దేశంలో తక్కువ నిరుద్యోగము ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  పరిజ్ఞానం లేని కొందరు వెదవలు మిడ్ మానేరు దగ్గర కట్ట నుంచి నీరు వస్తున్నాయని సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  ఏడేళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి ? ఇప్పుడు ఏంటని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr