మా ప్ర‌భుత్వాన్నిఏమీ అన‌వ‌ద్దు.ఎందుకంటే వైసీపీ చేసేదంతా నిజం. చెప్పేదంతా కూడా నిజం. అని కొడాలి నాని అంటున్నారు.ప్ర‌శ్నించ‌డం అంటే విల‌నిజం అని కూడా ఆయ‌న మాటల అర్థం. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేత‌ల‌కు ఉన్న అర్థం కూడా ఇదే! ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!

ప్ర‌శ్నిస్తే విల‌నిజం.నిల‌దీస్తే విల‌నిజం.మాట్లాడితే ఎదురు మాట్లాడితే విల‌నిజం ఇదే ఇవాళ చెలామ‌ణి అవుతున్న నిజం. మంత్రి కొడాలి నాని చెబుతున్న నిజం.అంటే ఎవ్వ‌రూ దేనినీ ప్ర‌శ్నించ‌కూడ‌దు.ఎవ్వ‌రూ ఎవ్వ‌రినీ నిల‌దీయ‌కూడ‌దు. రాజ్యంలో అంద‌రినీ స‌మ దృష్టిలో చూడాల‌ని కోరుకోవ‌డంలో విల‌నిజం ఉంది. అదే నాని చెబుతున్న మాట. ఆయ‌న మాట‌కు ఎదురు చెప్పామా అంతే! ఆ విధంగా ప‌వ‌న్  ఇవాళ  విల‌న్. జ‌గ‌న్ ఇవాళ పొలిటిక‌ల్ మెగాస్టార్. అధికారంలో ఉండేది ఐదేళ్ల అన్న సంగ‌తి మాకు తెలుసు అని అంటున్నారు క‌దా! అంత తెలిసిన వాళ్లు ఎందుక‌ని పద్ధ‌తిగా న‌డుచుకోలేక‌పోతున్నారు అని జనసేన ప్ర‌శ్నిస్తోంది.

ముఖ్యంగా నానిని ఎదిరించి మాట్లాడినా మాట‌లేవీ ప్ర‌జా స్వామ్య విరుద్ధం అయినవి ఏమీ కావు.ఓ సినిమాను తొక్కేయాల‌న్న ఆలోచ‌న అన్న‌ది నానికి లేదు అని అనుకోలేం. అయ్యో అదే క‌నుక ఉండి ఉంటే అస‌లు భీమ్లా నాయ‌క్ థియేట్రిక‌ల్ రిలీజ్ నే ఆపి ఉండే వాళ్లం అని వైసీపీ అంటోంది. అంటే ఓ వైపు సినిమా రిలీజ్ కు సంబంధించి ఎటువంటి అడ్డూ లేద‌ని చెప్పి, థియేట‌ర్ల‌పై దాడులు ఎందుకు చేయిస్తున్నార‌ని? టిక్కెట్ల అమ్మ‌కాల ద‌గ్గ‌ర త‌హ‌శీల్దార్ల‌ను ఎందుకు నియ‌మిస్తార‌ని? ఒక‌వేళ థియేట‌ర్లు నియమ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌నే అనుకుందాం వాటిని సినిమా రిలీజ్ ముందే సీజ్ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంది కానీ సినిమా రిలీజ్ అయ్యాక‌నో లేదా రేపు రిలీజ్ అంటే ముందు రోజునో ఇలాంటి డ్రామాలు ఎందుకు న‌డ‌ప‌డం?

జ‌న‌సేన అనే పార్టీ వైసీపీకి అడ్డు అని భావిస్తున్నాం  క‌నుక‌నే మేం ఇలా చేస్తున్నాం అని బ‌హిరంగంగా చెప్ప‌వ‌చ్చు క‌దా ! అని అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు.ఓవైపు మాకు ఎవ్వ‌ర‌న్నా భ‌యం లేదు.భ‌యానికి మీనింగ్ తెలియ‌ని బ్ల‌డ్ మాది అని చెప్పిఎందుక‌ని హ‌డ‌లిపోతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప‌వ‌న్ అభిమానులు.పొలిటిక‌ల్ మెగాస్టార్ జ‌గ‌న్ అని చెప్ప‌డం అస్స‌లు బాలేద‌ని కూడా అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.అంద‌రినీ స‌మానంగా చూడాల‌ని అప్పుడే మెగాస్టార్ అయినా పొలిటిక‌ల్ మెగాస్టార్ అయినా జ‌నం మెప్పు పొందుతార‌ని అంటున్నాయి ప‌వ‌న్ వ‌ర్గాలు. కానీ ఇవేవీ ఇప్పుడు లేవ‌ని, బాల‌య్య‌కు ఓ విధంగా మాకు మ‌రో విధంగా సహ‌జ నాయ సూత్రాల‌కు విరుద్ధంగా ఉంటున్నార‌ని మండిప‌డుతున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: