జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు మ‌రో సంక‌ట‌క‌ర స్థితి వ‌చ్చి ప‌డింది.కులాల పేరిట కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్న వైసీపీ నాయ‌కుల‌కు ఝ‌ల‌క్ త‌గిలింది.వాస్త‌వానికి అవి పేరుకే కులానికో కార్పొరేష‌న్లు అని, వాస్త‌వానికి నిధులు అంటూ ఏమీ లేని అసక్త‌త‌తో కూడిన ఏ అధికారం మ‌రియు ఆర్థిక వ‌న‌రులూ లేని కేంద్రాలు అని మండిప‌డుతున్నారు కాపు నేత‌లు. ఒక్క కాపు నేత‌లే కాదు త్వ‌ర‌లో బీసీ,ఎస్సీ కుల‌స్తులు కూడా వీరితో క‌లిసి పోరాట పంథాను నిర్మించ‌నున్నారు. ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేయ‌నున్నారు.ముఖ్యంగా కాపుల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం ప‌ద‌వుల ప‌రంగా ఉన్నా కూడా అధికార బ‌లం మొత్తం వైసీపీ పెద్ద‌లు అయిన రెడ్డి సామాజిక‌వ‌ర్గం చేతిలోనే ఉంద‌న్న అభిప్రాయం ఇప్ప‌టికే సుస్ప‌ష్టం అయిపోయింది.దీంతో బొత్స ఈ స‌మావేశానికి రాకున్నా ఇదే అభిప్రాయంలో కాపులు ఉన్నార‌న్న‌ది అంగీక‌రించ‌క త‌ప్ప‌ని నిజం.ఇవేవీ కాద‌ని రాజ‌కీయం చేస్తామంటే ఇక‌పై కుద‌ర‌ని ప‌ని.

ముఖ్యంగా ముద్ర‌గ‌డ లాంటి నాయ‌కుల సాయంతో జ‌గ‌న్ ఒడ్డెక్కాల‌ని చూస్తున్నా,కొన్నిస‌మ‌యాల్లో చిరంజీవి లాంటి వారి సాయం తీసుకుని తీరాల‌ని భావిస్తున్నా అదే సమ‌యంలో అదే కాపు వ‌ర్గానికి చెందిన నేత ప‌వ‌న్ ను రాజ‌కీయంగా ఏ విధంగా అణ‌గ‌దొక్కుతున్నారో అన్న‌ది కూడా ఓ చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం నిన్న‌టి వేళ లేక‌పోలేదు.అదే గ‌నుక జ‌రిగితే వైసీపీకి ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌వు. చిరంజీవిని ప్ర‌సన్నం చేసుకుని,ప‌వ‌న్ ను దూరం చేసుకునే ఆలోచ‌న ఒక‌టి ఎన్న‌టికీ స‌బ‌బు కాద‌ని కూడా ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌.ఒక‌వేళ రాజ్య స‌భ టికెట్ ను కాపుల‌కు కేటాయించినా కూడా ప‌వ‌న్ మాత్రం త‌న పంథాను మార్చుకోరు అని ఎప్పుడో తేలిపోయింది క‌నుక కాపులంతా ఏక‌మై వైసీపీపై ఊరురా పోరు ప్రారంభిస్తే జ‌గ‌న్ పార్టీలో క‌ల్లోలిత వాతావ‌ర‌ణం ఒక‌టి ఆరంభం కావ‌డం ఖాయం.

విశాఖ కేంద్రంగా నిన్న‌టి వేళ కాపు  నేత‌లంతా స‌మావేశం అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత‌లంతా ఒక చోటుకు చేరుకుని త‌మ బాధ‌లు, ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ప‌డుతున్న ఇబ్బందులు త‌దిత‌ర విష‌యాలపై సుదీర్ఘ కాలం చ‌ర్చించారు. త్వ‌ర‌లో ఫోరమ్ ఫ‌ర్ బెట‌ర్ ఏపీ అనే రాజ‌కీయ చైత‌న్య వేదిక‌ను ఏర్పాటు చేసి, సామాజికంగా కాపులు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌పై,అదేవిధంగా ఆర్థికంగా కాపులు ప‌డుతున్నఒడిదొడుకుల‌పై పోరాడేందుకు సిద్ధం అవుతున్నారు.నిన్న‌టి స‌మావేశానికి గంటా శ్రీ‌నివాస‌రావు, వ‌ట్టి వ‌సంత కుమార్, బోండా ఉమాతో పాటు మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు తో స‌హా అన్ని ప్రాంతాల‌కూ చెందిన ముఖ్య నేత‌లు పాల్గొని, త‌మ త‌మ ప్రాధాన్యాలు వివ‌రించారు.

ఇప్పుడీ చ‌ర్చ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను దుమారం రేపుతోంది. పార్టీల‌కు అతీతంగా అంత‌మంది నాయ‌కులు ఏక‌మై ఒకే వేదిక‌పై రావ‌డంతో రానున్న కాలంలో కాపుల‌కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే రాజ‌కీయంగా భ‌విష్య‌త్ అంధకారం అవ్వ‌డం  ఖాయ‌మ‌న్న అభిప్రాయం అధికార పార్టీలో క‌లిగేలా చేయ‌గ‌లిగారు.అదేవిధంగా కాపు కార్పొరేష‌న్ కు నిధులు లేవ‌ని,అలాంట‌ప్పుడు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి ఏం ఉప‌యోగం అన్న భావ‌న కూడా వ‌స్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: