పాల‌న‌పై ప‌ట్టు లేని జ‌గ‌న్ మ‌రో ప‌స‌లేని నిర్ణ‌యం తీసుకుని జ‌నంపై రుద్దుతున్నారు అన్న‌ది విప‌క్షాల ఆరోప‌ణ.కొత్త జిల్లాల ఏర్పాటు అన్న‌ది కత్తిమీద సాము లాంటిది అని ఈ పాటికే అర్థం చేసుకుని ఉండాల్సింది అని హిత‌వు చెబుతున్నారు. ఉగాది నుంచి ప్రారంభం కానున్న జిల్లాల ఏర్పాటుపై ఇప్ప‌టికే సంబంధిత ప్ర‌క్రియ మొద‌ల‌యిన నేప‌థ్యంలో వైసీపీ స‌ర్కారు ప్రాంతాల వారీగా అభిప్రాయాలు సేక‌రిస్తోంది.విమ‌ర్శ‌లు వింటోంది. ప్ర‌తిపాద‌న‌ల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తోంది.ఆ విధంగా జ‌గ‌న్ అండ్ కో కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేయాల‌ని భావిస్తోంది.ఈ మేర‌కు నిర్దేశిత కార్యాచ‌ర‌ణ‌ను అనుస‌రించి ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీ‌కారం దిద్ది, అనుకున్న విధంగా ముంద‌డుగు వేయాలి అని సంక‌ల్పిస్తోంది.

ఇక జిల్లాల ఏర్పాటుపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఉత్త‌రాంధ్ర వ‌ర‌కూ ప్ర‌ధాన అభ్యంతరాలు ఉన్నా అవేవీ ప‌రిష్కృతం అయ్యేలా లేవు.పెందుర్తిని అన‌కాప‌ల్లిలో కాకుండా విశాఖ‌లోనే ఉంచాల‌ని డిమాండ్ చేస్తోంది టీడీపీ. ఇదే పెద్ద వివాదంగా మార‌నుంది రేప‌టి వేళ. ఒక‌వేళ టీడీపీ మాట‌కు త‌లవంచితే తాము ఎక్క‌డ ఓట‌మిని అంగీక‌రించినవారం అవుతామేమోన‌ని వైసీపీ ఇప్ప‌టి నుంచే బెంగ ప‌డుతోంది. అదేవిధంగా అన‌కాప‌ల్లి కేంద్రంగా ఏర్పాట‌య్యే  జిల్లాకు న‌ర్సీప‌ట్నంను హెడ్ క్వార్ట‌ర్ గా ఉంచాల‌ని కూడా అంటున్నారు. ఇది కూడా టీడీపీ నుంచి బ‌లంగానే వినిపిస్తోంది.ఆ రెండు స‌మ‌స్య‌లు జ‌గ‌న్ తీర్చాల‌నుకోరు అన్న‌ది కూడా టీడీపీ అనుమాన‌మే! ఆ విధంగా ఒక‌వేళ అనుకోకుండా స‌మ‌స్య ప‌రిష్కారానికే ప్రాధాన్యం ఇస్తే ఈ ముఖ్య‌మంత్రి ప్ర‌జాభిప్రాయం గౌరవించిన వారే అవుతారు. పేర్ల‌కు  సంబంధించి ఒక‌ట్రెండు అభ్యంత‌రాలు ఉన్నా అవి కూడా సాల్వ్ అయ్యేలా లేవు. ఒక‌వేళ ప‌రిష్క‌రించినా వాటి కార‌ణంగా అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ  పెద్ద‌గా పొందే రాజ‌కీయ ల‌బ్ధి ఏమీ ఉండ‌దు.



ప్ర‌ధానంగా ఇరిగేష‌న్ సెక్టార్ కు నిధులు ఇచ్చి ఆదుకుంటే మేలు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌కు సాగునీరు ఇచ్చే తోట‌ప‌ల్లి ప్రాజెక్టుకు కానీ లేదా ఇత‌ర ప్రాజెక్టుల‌కు కానీ నిధులు ఇస్తే చాలు ఇంకేం వ‌ద్దు అన్న వాద‌నే ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.ఇక ఎలానూ విశాఖ స్టీల్ ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేస్తారు క‌నుక క‌నీసం అక్క‌డున్న ఉద్యోగుల‌కు ఉపాధి పోకుండా చూడాల్సిన బాధ్య‌త మాత్రం ఇక్క‌డున్న అన్ని పార్టీల పెద్ద‌ల‌దే! కానీ అది కూడా నెర‌వేర‌దు  అని అనుమానాలు ప్లాంటు ఉద్యోగుల నుంచి వ‌స్తోంది. ఏ విధంగా చూసుకున్నా ఆర్థిక రాజ‌ధానిని అభివృద్ధికి, కొత్త జిల్లాల ఏర్పాటుకు అస్స‌లు సంబంధ‌మే లేదు కానీ ఆ మాట అంటే వైసీపీ ఒప్పుకోదు గాక ఒప్పుకోదు.



మరింత సమాచారం తెలుసుకోండి: