మాట్లాడాల్సినంత మాట్లాడి నెగ్గుకు రావాలి
అప్పుడే కేసీఆర్ గెలుపు..
అనుచితం అనుకున్న‌వి వ‌ద్ద‌నుకుని
ప్రాధాన్య రీతుల‌కు అనుగుణంగా గొంతుక వినిపించాలి
అప్పుడే కేసీఆర్ గెలుపు కూడా...

మొద‌ట్నుంచీ బీజేపీని వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్ కు మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చింది.అవ‌కాశ‌మూ అదే! అదృష్ట‌మూ అదే! యూపీ లో ఆయ‌న ప‌ర్య‌టిస్తే,యూపీ లో ఆయ‌న మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న ఏకైక ప్ర‌తిపాద‌నే క‌డు ఆస‌క్తిక‌రంగాఉంది.దీంతో తెలంగాణ చంద్రుడి రాక,ఆయ‌న చెప్పే మాట ఈ రెండూ కూడా దేశ రాజ‌కీయాల‌కు అత్యంత ప్రాధాన్యాంశాలు కానున్నాయి. కేసీఆర్ మాట‌లు ఇంకాస్త ఆక‌ట్టుకుంటే ఇక జాతీయ స్థాయిలో ఆయ‌నొక స్టార్ క్యాంపైన‌ర్ కావ‌డం ఖాయం.

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఘ‌ట్టం చివ‌రికి చేరుకుంది.ఇప్పుడు నాలుగో విడ‌తకు ఐదో విడ‌త‌కు ఆ రాష్ట్రం సిద్ధం  అవుతోంది.నాలుగో విడ‌త రేపు జ‌రిగితే, మార్చి ఏడున తుది విడ‌త జ‌ర‌గ‌నుంది.ఇందుకు ఆ రాష్ట్ర ఓట‌ర్లు ఆస‌క్తితో ఉన్నారు.యూపీ ఫ‌లితాలు దేశాన్నే క‌దిపి కుదిపేస్తాయ‌న్న‌ది ఓ అంచ‌నా! యూపీ ఫ‌లితాలు ఆధారంగానే రేప‌టి వేళ దేశాన్ని  పాలించే శ‌క్తులు ఎవ‌ర‌న్న‌ది కూడా తేలిపోనుంది.అందుకే అంతా యూపీ వైపే ఆస‌క్తిగా చూస్తున్నారు.ఫ‌లితాల రాక నేప‌థ్యంలో ఏం చేయాల‌న్నా ఫ‌లితాల‌కు ముందు వాటిని ప్ర‌భావితం చేసేలా ఏం మాట్లాడాల‌న్న అందుకు త‌గ్గ విధంగా నాయ‌కులు త‌మ‌ని తాము సిద్ధం చేసుకుంటున్నా రు.ఈ సారి యూపీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఆయ‌న స్నేహితుడు అయిన ఓవైసీ కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. ఓవైసీ ప్ర‌చారం త‌రువాత కాల్పుల క‌ల‌వ‌రం ఎలా ఉన్నా ఆయ‌న సాయం కార‌ణంగానే బీజేపీ  కొంత ల‌బ్ధి పొంద‌నుంది అని తెలుస్తోంది.

ఇక కేసీఆర్ రావ‌డం ఢిల్లీలో మూడు రోజుల పాటు ఉండ‌నుండ‌డం అదేవిధంగా కేజ్రీ తో చ‌ర్చ‌ల అనంత‌రం యూపీకి వెళ్లాల‌నుకోవ డం అన్న‌వి ఇవాళ శ‌ర‌వేగంగా మారిపోతున్న ప‌రిణామాల‌కు సంకేతం.అయోధ్య రాముడ్నే న‌మ్ముకున్న బీజేపీకి తుది విడ‌త‌లో తీర్పు ఎలా ఉండ‌నుంది అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా ఉంది. ఇక్కడ కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసిన తీరు ఇక‌పై చేయ‌నున్న తీరు వీటిపై కూడా బీజేపీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది. క‌నుక‌నే హిందుత్వ అజెండాగా ముందుకుపోయే మోడీ ఇప్ప‌టికే త‌న‌దైన గొంతుక వినిపించి వ‌చ్చారు.వార‌ణాసికి సేవ చేసుకోవ‌డం త‌న అదృష్టం అని చెప్పారు.ఇదే విధంగా రాహుల్ కూడావెళ్లే వ‌చ్చారు. ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసే బాబాల‌నూ, మ‌త గురువుల‌నూ న‌మ్ముకునే వ‌చ్చారు. ఇక ఆఖ‌రుగా  అన్ని మ‌తాల మధ్య స‌ఖ్య‌త‌ను కోరుకునే మ‌నిషిగా, బీజేపీ హిందుత్వ రాజ‌కీయాల‌కు ఎదురు నిలిచే వ్య‌క్తిగా గుర్తింపు పొందిన కేసీఆర్ సీన్లోకి వ‌చ్చారు.ఆయ‌నొచ్చాక ఫ‌లితాలు మారిపోతాయి అని కాదు కానీ ఆయ‌న మాట‌ల ప్ర‌భావం, ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించే తీరు ఎలా ఉంటాయ‌న్న‌వి మాత్రం ఆస‌క్తిదాయ‌కంగా మార‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: