గత కొంత కాలం పై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. ఇక ఇటీవలే బేగంపేట కాకతీయ కాలేజీ లో నిర్వహించిన సిఐఐ తెలంగాణ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రం తీరును తప్పుబడుతూ విమర్శలు చేశారు.


 ఇండస్ట్రీ పాలసీని సరైన రీతిలో అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది అంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని.. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పులు అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సూచించారు మంత్రి కేటీఆర్. స్వతంత్ర భారతంలో విజయవంతమైన స్టార్టప్ తెలంగాణ మాత్రమే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.


 తెలంగాణ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతోందని.. అంతేకాదు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అంటూ ఎంతో మంది ఉద్యమం సమయంలో ప్రశ్నించారు.. ఇక ఇలా ప్రశ్నించిన వారందరికీ కూడా ఒకటే సమాధానం ఇప్పుడున్న తెలంగాణ అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు పరిశ్రమలు వచ్చే విధంగా కేంద్ర వ్యవహరించడం సరి కాదు అంటూ వ్యాఖ్యానించారు. భారత్లో బీజేపేతరా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని కానీ కేంద్రం ఆ విధంగా ముందడుగు వేయడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: