యుద్ధంలో ఓడిపోయాక రాజు ఇంటికివెళ్లాలి.ప‌రాభ‌వం త‌ప్పినా స‌రే ఇంటికే వెళ్లాలి.మ‌ళ్లీ కొత్త వ్యూహం రాసుకుని దండ యాత్ర చేయాలి.శ‌త్రుమూక‌ల‌పై పై చేయి సాధించాలి.ఇది యుద్ధ రీతి,సూత్రం కూడా! కానీ జ‌గ‌న్ కు మాత్రం ఇంటికి వెళ్లేలోగానే మ‌ధ్యే మార్గంగా గెలుపు సూత్రాలు ఏమున్నాయో అన్న ఆత్రం పెరిగిపోతోంది.దీని కార‌ణంగానే ఆయ‌న అప్పుడే సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని అంటున్నారు. ఎందుకు వెళ్ళ‌డం.. కాస్త ఆగితే బాగుంటుంది క‌దా! అని వైసీసీ లో కొంద‌రు అంటున్నారు. తాము తీర్పును గౌర‌విస్తామ‌ని నిన్న ఎక్క‌డా జ‌గ‌న్ అన‌లేదు. క‌నీసం ఆ ప్రాంత రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని కూడా చెప్ప‌డం లేదు.ఇవేవీ కూడా గౌర‌వ పార్టీల గౌర‌వాన్నీ పెంచే ప‌నులు అయితే కావు. ఆ విధంగా జ‌గ‌న్ త‌న హుందాత‌నాన్ని కోల్పోతున్నారు.


అమ‌రావ‌తి ఆంధ్రుల‌ది అంద‌రిది అని తేల్చింది హై కోర్టు. హై కోర్టు ఆ విధంగా చెప్పినా కూడా సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని యోచిస్తోంది వైసీపీ.అంటే తాము యుద్ధంలో ఓడిపోలేద‌ని వాళ్లు గెల‌వ‌నూ లేద‌ని ఇంకా యుద్ధం మిగిలి ఉండ‌గా గెలుపు మ‌రియు ఓట‌మిని డిక్లైర్ చేయ‌డం భావ్యం కాద‌ని వైసీపీ త‌ర‌ఫున జ‌గ‌న్ సుద్ధులు అన‌గా నీతులు చెబుతున్నారు.ఇదే స‌మ‌యంలో రాజ‌ధాని విష‌య‌మై కోర్టు చాలా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.ఇవి కూడా బొత్స కోపానికి కార‌ణంఅయ్యాయి.అస‌లు సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు చేసే అధికారం అసెంబ్లీకే లేద‌ని చెప్పేసింది.అంటే అర్థం ఆ చ‌ట్టాన్ని య‌థాత‌థంగా నోటిఫై ఏరియాలోఅమ‌లు చేయ‌మ‌ని..ఇదే బొత్స కోపానికి కార‌ణం అయింది.



చ‌ట్ట‌స‌భ‌లకు చ‌ట్టాలు చేసే అధికారం లేదా ? అని మండిప‌డ్డారు.అలాఅయితే పార్ల‌మెంట్ ఎందుకు అసెంబ్లీ ఎందుకు అని ప్ర‌శ్నించారు. ఇదే ఇప్పుడు వివాదాల‌కు తావిస్తోంది. కోర్టు తీర్పు చ‌దివి స్పందిస్తాన‌ని చెప్పిన బొత్స ఎందుక‌ని మ‌ళ్లీ తొంద‌ర‌పాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.అప్పుడు మంత్రి బొత్స‌ది కోర్టు ధిక్కార నేరం కాదా?


సీఆర్డీఏ ప‌రిధిలో భూములు ముట్టుకోవ‌డానికి లేదు. అంటే అవి రాజ‌ధాని అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించాలి.వీలున్నంత మేర అభివృద్ధి చేయాలి.అభివృద్ధిలో భాగంగా మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ రైతుల‌కు ఒప్పందం ప్ర‌కారం  కొన్ని ఫ్లాట్ల‌ను కానీ లేదా క‌మ‌ర్షియ‌ల్  క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ కానీ అప్ప‌గించాలి. ఒక్క రూపాయి కూడా రైతుకు ఇవ్వ‌కుండా భూమికి భూమి బ‌దులు ఇచ్చే  ప్ర‌క్రియ చంద్ర‌బాబు పూలింగ్ పేరిట తీసుకువ‌చ్చారు.దానిని నిజంగానే అభినందించాలే! ఏదేమ‌యిన‌ప్ప‌టి ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తే!

మరింత సమాచారం తెలుసుకోండి: