ఢిల్లీ కేంద్రంగా పొలిటిక‌ల్ లాబీయిస్టుల‌కు అస్స‌లు కొద‌వే ఉండ‌దు.వీళ్లు అటు టీడీపీ త‌ర‌ఫున ప‌నిచేస్తారు ఇటు వైసీపీ త‌ర‌ఫున కూడా ప‌నిచేసి త‌మ చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించి సంబంధిత అధినాయ‌క‌త్వాల ద‌గ్గ‌ర మంచి గుర్తింపు పొందేందుకు,ఆర్థిక లబ్ధి అందుకునేందుకు తెగ తాప‌త్ర‌య‌ప‌డ‌తారు.అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఎంద‌రో ఉన్నారు. ఎంద‌రో నాయ‌కులు ఆ విధంగానే గ‌ట్టెక్కారు కూడా! ఈ కోవ‌లోనే పోలిటిక‌ల్ లాబీయింగ్ చేసిన నాయ‌కుల జాబితాలో టీడీపీ నుంచి కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చింది అంతే తేడా మిగ‌తాదంతా సేమ్ టు సేమ్..లాస్ట్ పంచ్ జ‌గ‌న్ ది ఫ‌స్ట్ లాఫ్ బొత్స‌ది. వీరిని చూసి మురిసిపోవ‌డం మోడీ వంతు కూడా కావొచ్చు! తాజాగా గులాం న‌బీ ఆజాద్ వంతు కూడా కావొచ్చు.

లాబీయింగ్ పాలిటిక్స్ లో న‌డ‌ప‌డంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణను మించి ఎవ్వ‌రూ ఉండ‌రు అన్న‌ది ఓ ఓపెన్ సీక్రెట్. ఓపెన్ టాక్ కూడా ఇదే! టీడీపీకి కూడా అనుబంధంగా ఉండే మంత్రి బొత్స అవ‌స‌రం అయితే టీఆర్ఎస్ తోనూ త‌న ప‌నులు చేయించుకోగ‌ల‌రు.అంత‌టి స‌మ‌ర్థుడిగాఆయ‌న‌కు పేరుంది. అటు రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ ఇటు దేశ‌రాజ‌కీయాల్లోనూ ఏక‌కాలంలో రాణించాల‌ని ఎప్ప‌టి నుంచో ఉవ్విళ్లూరుతున్నారు.గ‌తంలో కూడా ఆయ‌న భార్య బొత్స ఝాన్సీ రాణి విజ‌య‌న‌గ‌రం ఎంపీగా ప‌నిచేశారు. కాంగ్రెస్ హ‌యాంలో ఆ రోజు ఆ ఇంట్లో ప‌ద‌వులే ప‌ద‌వులు.బొత్స తో పాటు ఆయ‌న భార్య త‌మ్ముడు అల్లుడు ఇలా కుటుంబం అంతా రాజ‌కీయాల్లోనే ఉన్నారు.ఆ రోజు ప‌ద‌వులు ఈ రోజు ప‌దవులు ఒక్క‌టి కాక‌పోయినా కూడా బొత్స‌కు ఎదురు అన్న‌ది లేదు.


ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లోనే కాదు ఉమ్మ‌డి ఆంధ్రా రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న‌కు ఎదురులేదు. రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఎంతో చేరువగా ఉంటూ ఎన్నో ప‌నులు చేయించుకున్నారు.ఆ రోజు అక్ర‌మాస్తుల కేసులో బొత్స‌కు కూడా భాగం ఉన్నా ఛార్జిషీట్ దాఖ‌లు స‌మ‌యంలో సీబీఐ క‌న్ను నుంచి తృటిలో త‌ప్పించుకున్నార‌ని ఇవాళ్టికీ అంటుంటారు. వైఎస్ జ‌గ‌న్ ను అయినా ఇప్పుడు వ్య‌తిరేకిస్తారు కానీ ఆనాడు వైఎస్సార్ ను మాత్రం ప‌ల్లెత్తు మాట అననిచ్చే వారు కాదు.పాద‌యాత్ర స‌మ‌యంలో విజ‌య న‌గ‌రం ఒక్క‌టే కాదు ఉత్త‌రాంధ్ర అంత‌టా ఆయ‌నే అన్నీ తానై వైఎస్ కు స‌హ‌కారం అందించారు.తాజాగా ఒక‌నాటి కాంగ్రెస్ స్నేహితుడు అయిన ఆజాద్ (పూర్తి పేరు గులాం న‌బీ ఆజాద్) కు రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో ప‌రిపూర్ణ స‌హ‌కారం అందించేందుకు పావులు క‌దుపుతున్నారు.ఇందుకు జ‌గ‌న్ స‌మ్మ‌తి కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: