త్వ‌ర‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు బ్ర‌ద‌ర్ అనీల్ సిద్ధం అవుతున్నారు.దివంగ‌త నేత వైఎస్సార్ అల్లుడు బ్ర‌ద‌ర్ అనీల్ ఇవాళ ఇందుకు సంబంధించి ఓ కీలక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలున్నాయి.
 
ఏపీలో మ‌రో పొలిటిక‌ల్ తుఫాను ఆరంభం అయింది.గ‌తంలో లేని విధంగా రెండు ప్ర‌ధాన  వ‌ర్గాలు జ‌గ‌న్ కు ఝ‌ల‌క్ ఇచ్చి బ్ర‌ద‌ర్ అనీల్ వెంట న‌డ‌వ‌నున్నాయి.ఇందుకు సంబంధించి కీల‌క చ‌ర్చ‌ల‌కు ఇవాళ విజ‌య‌వాడ వేదికైంది. దీంతో ఈ పొలిటిక‌ల్ తుఫాను ఎంత కాలం ఉంటుంది.. ఉండి ఏం సాధించ‌నుంది అన్న‌ది ఇప్పుడొక ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది.ఎందుకంటే ఇప్ప‌టికే జ‌న‌సేన,టీడీపీ లాంటి పార్టీలు మూకుమ్మ‌డిగా బీజేపీని క‌లుపుకోకుండానే దాడి చేస్తున్నాయి వైసీపీపై. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఒంట‌రిపోరే చేస్తోంది.కొన్నిసార్లు టీడీపీ వైఖ‌రికి కొన్ని నిర‌స‌న‌ల‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇవ‌న్నీ కూడా మంచి ఫ‌లితాలే ఇస్తాయి అని భావిస్తున్న త‌రుణంలో కొత్త పార్టీ గుస‌గుస‌లు మాత్రం జోరందుకోవ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో హ‌డ‌ల్ మొద‌ల‌యింది. క‌ల‌వ‌రం మొద‌లు అయింది.దీంతో ఎప్పుడు ఏం జ‌ర‌గ‌నుందో అన్న ఆస‌క్తి నెల‌కొంది.

వాస్త‌వానికి గ‌త ఏడాది జ‌రిగిన వైఎస్సార్ 12వ వ‌ర్థంతి సంద‌ర్భంగా విజ‌య‌మ్మ న‌ర్మ‌గ‌ర్భంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. త‌న బిడ్డ జ‌గ‌న్ ను ఆద‌రించిన విధంగానే కుమార్తె ష‌ర్మిల‌నూ ఆద‌రించాల‌ని కోరారు.వాస్త‌వానికి ఆ రోజు  ఉన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఓ కొత్త పార్టీ ఆంధ్రాలో ప్ర‌వేశ పెట్టనున్నారు అన్న సంకేతాలు కూడా వ‌చ్చాయి.కానీ అవేవీ త‌రువాత కాలంలో పెద్ద‌గా బ‌ల‌ప‌డ‌లేదు.వైఎస్సార్టీపీ ఆరంభం త‌రువాత ఇటీవ‌ల ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కూడా గుర్తింపు ఇవ్వ‌డంతో ఇక ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు మ‌రింత ముమ్మ‌రం అయ్యాయి.ఈ ద‌శ‌లో ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టే అవకాశాల‌ను తాను కొట్టిపారేయ‌లేనని గ‌తంలోనే చెప్పారు. దీంతో ఏ క్షణంలో అయిన ష‌ర్మిల పార్టీ పెట్ట‌బోతున్నార‌న్న సంకేతాలు వ‌చ్చిన  నేప‌థ్యంలో పరిణామాలు అన్నీ ఒక్క‌సారిగా మారిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: