ఇపుడిదే రాజకీయంగా హాట్ టాపిక్ అయిపోయింది. వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతానికి తెలుగుదేశంపార్టీలో ఉన్నారు. అయితే పార్టీ నేతగా యాక్టివ్ గా లేరు. రాధా ఏపార్టీలో ఉన్నా పెద్దగా యాక్టివ్ గా ఉండరని అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బోండాఉమ గెలుపుకు కొంత కష్టపడినా తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.





అలాంటిది ఇపుడు హఠాత్తుగా రాధా విషయం వార్తల్లో ఎందుకు నలుగుతోంది ? ఎందుకంటే ఆమధ్య తనను హత్య చేయటానికి రెక్కీ నిర్వహించారంటు తన తండ్రి వంగవీటి రంగా వర్ధంతి రోజున ప్రకటించి సంచలనం రేపారు. అప్పటి నుండి ఏదో సందర్భంలో రాధాపేరు వార్తల్లో నానుతునే ఉంది. ఇపుడు రాధా కేంద్రంగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో రాధా గుడివాడ నుండి పోటీ చేయబోతున్నారట.





విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలని పట్టుబట్టే రాధా గుడివాడ నుండి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోందో అర్ధం కావటంలేదు. నిజానికి వైసీపీ, టీడీపీల నుండి సెంట్రల్ నియోజకవర్గంలో పోటీకి రాధాకు అవకాశం లేదనే చెప్పాలి. నిజంగానే సెంట్రల్ నియోజవర్గంలో పోటీకి సీరియస్ గా ఉంటే జనసేనలో చేరితే ఏమైనా అవకాశం ఉండచ్చంతే. ఇపుడు రాధాకు గుడివాడకు కనెక్షన్ ఏమిటి ? ఏమిటంటే రాధా తరచు గుడివాడలో పర్యటిస్తున్నారట.





గుడివాడలోని కాపులతో భేటీ అవుతున్నారట. ఈమాత్రం దానికే రాధా గుడివాడలో పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగిపోతోంది. ఇక మంత్రి కొడాలి నానిది గుడివాడే అన్న విషయం తెలిసిందే. కొడాలి, రాధా ఇద్దరు అత్యం సన్నిహితులు. టీడీపీకి గుడివాడలో సరైన అభ్యర్ధే లేరు. కాబట్టి రాధాను చంద్రబాబు గుడివాడలో పోటీ చేయమన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రచారమే నిజమైతే రాధా తన సన్నిహితుడికి వ్యతిరేకంగానే పోటీచేస్తారా ?





ఎందుకంటే కొడాలికి నియోజకవర్గంలో గట్టిపట్టుంది. కమ్మ సామాజికవర్గంతో పాటు కాపులు, బీసీలనే తేడాలేకుండా అన్నీ సామాజికవర్గాల్లోని వారికి కొడాలి అందుబాటులో ఉంటారు. కాబట్టి కొడాలిని ఢీకొట్టడం టీడీపీ వల్ల కావటంలేదు. మరి రాధా వల్ల అవుతుందా ? అసలు జరుగుతున్న ప్రచారం నిజమేనా ? తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: