తెలంగాణా అన్నీ రంగాల్లొ ముందు ఉందన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా, శిశు సంక్షేమంలో మొదటి  కొనసాగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐ.టి. శాఖా మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ని మహిళా జర్నలిస్టులకు గౌరవ పురస్కారాలను రాష్ట్ర మున్సిపల్, ఐ.టి శాఖ మంత్రి కె.టీ.రామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్ లు సత్కరించారు. వివిధ పత్రిక, వార్థా ప్రసార మాధ్యమాల్లో పని చేస్తున్న మహిళ రిపోర్ట్సు ను అధికారులు గౌరవ పురష్కారాలను అందజెసారు.


రాష్ట్రంలో ని ప్రతీ ఒక్క రంగంలో ని వారు తమసేవలకు గుర్తింపు కోరుకుంటారని, ఈ క్రమంలోనే వీరి సేవలకు గుర్తింపుగా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున చిరు సత్కారం చేస్తున్నామని చెప్పారు.. తెలంగాణా ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల తో అబివృద్ది, సంక్షేమ రంగంలో వచ్చిన మార్పులను  ప్రజలను చైతన్యం చేసే విధంగా వార్తలను ప్రజలకు తెలియజెయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రం లో 18000 పోలీసు ఉద్యోగాల నియామకం జరిగితే దానిలో 30 శాతం మంది మహిళలే ఉండటం విశేషం.. విధ్యుత్ శాఖలో 9644 ఉద్యోగ నియామకాలు జరిగితే
అందులోనూ 50 శాతం మహిళలే ఉన్నారని తెలిపారు..


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఛానెల్
టీవీ5 న్యూస్‌ ప్రజెంటర్‌ రోజా ను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుతో సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు తెలంగాణాలో మహిళలు ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: