సీఎం జగన్ ప్రసంగంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జిల్లాల స్వరూపం మారుస్తున్నామని.. ప్రతి 6-7 నియోజకవర్గాలకో జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేశారు సీఎం జగన్.   కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సంస్కరణల్లో విజన్ ఎవరికి ఉందో అర్థమవుతోందని చెప్పారు సీఎం జగన్.  రాజధాని వికేంద్రీకరణ వద్దన్న వాళ్లు కూడా జిల్లాల వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారన్నారు సీఎం జగన్.   బాబుగారి బావ మరిది కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని అడిగారని గుర్తు చేశారు సీఎం జగన్.   తన బావగారి పరిపాలనలో బాబుగారిని అడగకుండా.. వైసీపీని అడుగుతున్నారన్నారు సీఎం జగన్.   బాబుగారి బావ మరిదే కాదు.. స్వయంగా చంద్రబాబు కూడా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు సీఎం జగన్.తన హయాంలో తానే చేసుకోలేకపోయిన చంద్రబాబు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారని చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 

  ఈ పరిస్థితుల్లో విజన్ ఎవరికి ఉందో అర్థం అవుతోందనాన్రు సీఎం జగన్.   ఈ చర్చ చేయలేకనే సభకు రాలేదని తెలిపారు సీఎం జగన్.  చంద్రబాబు హయాంలో కులం, ప్రాంతం, మతం చూడకుండా పథకాలు ఇచ్చారా..? అని ఫైర్ అయ్యారు సీఎం జగన్.   టీడీపీ హయాంలో లంచం లేకుండా ఓ పథకం పేదలకు ఇచ్చే పరిస్థితి ఉందా..? నిప్పులు చెరిగారు సీఎం జగన్.   దోపిడీ చేసే జన్మభూమి కమిటీలు కావాలా..? సంక్షేమ పథకాలను ఇంటికే తెచ్చిచ్చే గ్రామ సచివాలయ వ్యవస్థ కావాలా..? అని అగ్రహించారు సీఎం జగన్.   ప్రధాని, రాష్ట్రపతి పదవులను తిరస్కరించానని చెప్పుకునే చంద్రబాబు.. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఎందుకు కలగలేదో అర్థం కాలేదన్నారు సీఎం జగన్.   23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకుంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లే వచ్చాయని ఎద్దేవా చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి..  


మరింత సమాచారం తెలుసుకోండి: