చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే...వైసీపీ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ టీడీపీ హవా చాలావరకు తగ్గిపోయింది..2014 ఎన్నికల్లో గాని, 2019 ఎన్నికల్లో గాని జిల్లాలో వైసీపీ హవానే నడిచింది...2014లో వైసీపీ 8 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది...2019లో వైసీపీ 13, టీడీపీకి ఒకటి మాత్రమే దక్కింది...అంటే చిత్తూరులో వైసీపీ డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇదే డామినేషన్ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఉంటుందా? మరొకసారి చిత్తూరులో వైసీపీ పైచేయి సాధిస్తుందా? అంటే చెప్పలేని పరిస్తితి ఈ సారి మాత్రం చిత్తూరులో వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది...అలాగే గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న కొన్ని స్థానాల్లో వైసీపీకి మూడో సారి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలా మూడో ఛాన్స్ తక్కువగా ఉన్న స్థానాల్లో...పీలేరు, నగరి, పలమనేరు, పూతలపట్టు స్థానాలు ఉన్నాయని చెప్పొచ్చు.

పలమనేరులో 2014, 2019 ఎన్నికల్లో గెలిచింది...2014లో వైసీపీ తరుపున అమర్నాథ్ రెడ్డి గెలిచారు..ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చేశారు...ఇక 2019లో వెంకట్ గౌడ గెలిచారు..అయితే ఈ సారి వెంకట్ కు గెలుపు అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి...టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి చేతిలో గెలవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇక పీలేరులో వరుసగా వైసీపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు...ఇక ఈ సారి ఈయనకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మూడో ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.
 
ఇక నగరిలో రోజా వరుసగా రెండుసార్లు గెలిచారు...ఈమెకు కూడా మూడో ఛాన్స్ కనిపించడం లేదు...ఈ సారి సొంత పార్టీ వాళ్లే రోజాని ఓడించేలా ఉన్నారు...అటు టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే పూతలపట్టులో కూడా వైసీపీ వరుసగా గెలిచింది...ఈ సారి మాత్రం గెలిచే ఛాన్స్ తక్కువగా ఉంది...మొత్తానికి ఈ స్థానాల్లో వైసీపీకి థర్డ్ ఛాన్స్ ఉండేలా లేదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: