మంత్రివర్గంలో ఛాన్స్ కోసం మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు...జగన్ ఏదైనా లక్కీగా ఛాన్స్ ఇస్తే క్యాబినెట్ లో ఛాన్స్ దక్కించుకోవాలని యువ ఎమ్మెల్యేలు గట్టిగానే కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే జగన్ మంత్రివర్గంలో మార్పులపై క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసిందే...జూన్ నెలలో మార్పులు చేస్తానని చెప్పేశారు...అలాగే మెజారిటీ మంత్రులని తొలగించి...కొందరిని మాత్రమే మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తాననే హింట్ ఇచ్చారు.

దీంతో మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయడానికి ఆశావాహులు గట్టిగానే ట్రై చేస్తున్నారు...ఇదే క్రమంలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా కుల, జిల్లాల సమీకరణల్లో భాగంగా తమకు ఏమైనా ఛాన్స్ రాకపోదా అని చూస్తున్నారు. అలా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రివర్గంలో సీదిరి అప్పలరాజు, శంకర్ నారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్ లాంటి వారు ఛాన్స్ కొట్టేశారు. వీరికి మొదటి విడతలో జగన్ ఛాన్స్ ఇచ్చారు...ఇక రెండో విడతలో ఛాన్స్ కొట్టేయడానికి మరికొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు.

మొదటిసారి గెలిచి మంత్రులుగా ఛాన్స్ కొట్టేయడానికి చూస్తున్న వారిలో...అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,  సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు....వేరు గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు..అలాగే తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు.

ఇక వీరు జగన్ ఏమన్నా లక్కీ ఛాన్స్ ఇస్తారేమో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు..అయితే వీరిలో మంత్రి అయ్యే ఛాన్స్ ఒకరిద్దరికే కనబడుతుంది...ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ కు మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి..ఇటు ఎస్సీ కోటాలో పద్మావతికి ఏమన్నా లక్కీ ఛాన్స్ ఉండొచ్చు. ఇక రజిని విషయంలో క్లారిటీ లేదు. మిగిలిన వారికి మాత్రం ఏదో లక్కీగా ఛాన్స్ వస్తేనే తప్ప..ఇంకా వేరే విధంగా ఛాన్స్ లేదు. చూడాలి మరి ఫస్ట్ ఎమ్మెల్యేల్లో ఎవరికి లక్కీ ఛాన్స్ దొరుకుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: