రాజకీయ అవినీతి ! పాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది, దేశాన్ని భ్రష్టుపట్టిస్తుంది. పాలకుల చీకటి వ్యవహారాల పై నిఘా పెట్టి , నిలువరించి, నిలదీయాల్సిన సామాన్యుడు... నిత్య నిర్లిప్త స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రజల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు  పెడుతున్నా దేశంలో ఆకలిచావులు, అనారోగ్యాలు, కలుషిత జలాలు ఎందుకు లోపాలు గానే మిగిలి పోయాయి. ఈ లోపాలకు కారణం ఎవరు? 




. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి సూచిక ప్రకారం అత్యంత అవినీతి రహిత దేశాల్లో భారత్ ఎప్పుడైనా 50 స్థానాల లోపల ఉంది అంటే లేదు. దేశంలో ఏ పార్టీ  ప్రభుత్వం గద్దెనెక్కినా  ఇక్కడ మాత్రం మన స్థానం 50 పైనే ఉంటుంది కానీ కిందకి మాత్రం రాదు. 




. చేయకూడని పని చేయడం అవినీతి. చేయాల్సిన పని చేయకపోవడం కూడా పరోక్ష అవినీతి కిందే వస్తుంది. 61 గంటలా 45 నిమిషాలు సమావేశమైన లోక్ సభ, అందులో 59 గంటలా 7 నిమిషాల్ని వృథా చేసినప్పుడు, భారత ప్రజలు ప్రతి నిమిషం సభ జరపడానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు అంతకుమించిన అవినీతి ఇంకెక్కడైనా ఉంటుందా! 




. మన చదువులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. నాస్కామ్ అంచనా ప్రకారం 80 శాతం సాంకేతిక పట్టభద్రులూ 80 శాతం సాధారణ పట్టభద్రులూ ఐటీ కంపెనీల సంగతి పక్కన పెడితే కనీసం కాల్ సెంటర్లలో పనిచేయడానికి కూడా పనికిరారు అని తేల్చేసింది. 



. దేశంలో ప్రతి 4 నిమిషాలకూ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతోంది. 2020 నాటికి ఆ నిడివి నిమిషానికి మారే ఆస్కారం ఉంది. రహదారుల నిర్మాణం మరీ నాసిరకంగా ఉంటోంది. అయినవారికే కాంట్రాక్టులూ ! రవాణా శాఖ పనితీరునూ రాజకీయ దళారులు శాసిస్తున్నారు. తూకానికెళ్ళాల్సిన డొక్కు బండ్లు రోడ్ల మీదికి వస్తున్నాయి. 



. ప్రపంచ దేశాలతో పోలిస్తే , బరువు తక్కువ పిల్లలు భారత్ లోనే ఎక్కువ . చిన్నారుల్లో పోషక విలువల్ని పెంచడానికి ఏటా వేల కోట్ల రూపాయలు మంజూరవుతున్నాయి. అందులో రూపాయికి పావలా కూడా చేరాల్సిన వాళ్లకు చేరడం లేదు. అత్యున్నత స్థాయి నుంచి గల్లీ  దాకా ఎవరి స్థాయిలో వారు ప్రజా ధనాన్ని దిగమింగేస్తున్నారు. 




. మహిళలు సురక్షితంగా ఉద్యోగం చేసుకోవడానికి వీల్లేని అత్యంత చండాలమైన దేశాల్లో భారత్ దేశం ఒకటి. ఇక్కడ ప్రతి గంటకూ మహిళల మీద వరకట్న హత్య, అత్యాచారం, హత్యలు ఘటనలు జరుగుతున్నాయి. దీనికి బాధ్యత ఎవరు !

మరింత సమాచారం తెలుసుకోండి: