‘మనిషొక చోట..మనసొకచోట’ అనేది చాలామంది విషయంలో మనం వింటునే ఉంటాం. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కూడా అదే చెప్పుకుంటున్నారు జనాలు. పార్టీ ఆవిర్భావ సభ తర్వాత పవన్ పై ఇలాంటి ట్రోలింగ్స్, కామెంట్లు మరీ ఎక్కువైపోయాయి. ఇంతకీ విషయం ఏమిటంటే సభ చివరలో పవన్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటు భీషణ ప్రతిజ్ఞచేశారు. ఈ ప్రతిజ్ఞపైనే జనాలు మ్యాగ్జిమమ్ ట్రోలింగ్ చేస్తున్నారు.






పవన్ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా అందరికీ అర్ధమైపోతోంది. ఎలాగైనా చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలన్నది పవన్ ఆలోచన. అయితే మిత్రపక్షం  బీజేపీని దగ్గరకు రానీయటంలేదు. బీజేపీ అగ్రనేతలైనా, లోకల్ లీడర్లయినా చంద్రబాబు మాటెత్తితేనే మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో వారిని ఒప్పించి పొత్తులోకి చంద్రబాబును తీసుకొచ్చేంత సీన్ పవన్ కు లేదు. అలాగని బహిరంగంగా  ఆ విషయం చెప్పలేకపోతున్నారు.






ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలినవ్వను అని చెప్పిన పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో డైరెక్టుగానే ఆ మాట చెప్పచ్చు కదా ఎందుకని చెప్పలేకపోతున్నారు ?  మిత్రపక్షంగా టీడీపీని కూడా కలుపుకోవాలని పవన్ కు బలంగా ఉన్న విషయం తెలిసిపోతోంది. కానీ అదే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇక్కడే జనాలంతా పవన్ మరీ ఇంత పిరికివాడా అని ఆశ్చర్యపోతున్నారు. తన మనసులోని మాటను కూడా ధైర్యంగా చెప్పలేని పవన్ రేపు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఢీ కొడతారు ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.






అధికారంలో ఉన్న జగనే తమకు ఎవరితోను పొత్తుండదని స్పష్టంగా చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఎంతమంది జట్టుకట్టినా వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీచేస్తుందని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. మరి జగన్లో ఉన్న ధైర్యం పవన్లో ఎందుకు లేకపోయింది. ఇంత పిరికివాడైనపుడు ఏదేదో సొల్లు కబుర్లు చెప్పటం ఎందుకు ?  బీజేపీతో మిత్రపక్షంగా ఉండదలచుకుంటే చంద్రబాబును మరచిపోవాలి. లేదా చంద్రబాబుతో వెళ్ళదలచుకుంటే బీజేపీని వదిలేయాలి. అంతేకానీ పిరికితనంగా ఉంటే పవన్ ఏమీ సాధించలేరని తెలుసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: