ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలలో అన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకప్పుడు రాజకీయాలు సామరస్యంగా ఉండేవి. ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్లు బూతులు తిట్టడం, నాయకుల కుటుంబాల గురించి కించపరిచి మాట్లాడడం, వారి గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడం ఉండేది కాదు. కేవలం ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడేవారు. వారి తీరును అధికారికంగా ఖండించే వారు. కానీ మీరు ఇప్పుడు చూసే రాజకీయాలు కానీ, రాజకీయ నాయకులు కానీ గందరగోళంగా ఉన్నాయి. కొందరు అయితే మైక్ దగ్గరకు వస్తే తమ ప్రత్యర్థి పార్టీల వారిని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. కొందరు లీడర్ లు ఉన్నారు, వారికి తిట్టడమే పని వేరే పని పెట్టుకోరు.

అలాంటి నాయకులలో తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకరు. ఇపుడు తాజాగా మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. రీసెంటుగా విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ పై కేటీఆర్ ను ప్రశ్నించారు. రాజా సింగ్ మాట్లాడుతూ తెలంగాణాలో మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉంటే 80 వేలు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం దారుణం. మీరు అధికారంలో  ఉన్న ఏడు సంవత్సరాలలో 700 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఏమి చేయనుందో చెప్పాలి. ఇక కేంద్రంపై కేసీఆర్ ఉద్యోగాల విషయంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియడం లేదు.

ప్రతి సంవత్సరం కేంద్రం తన బాధ్యతగా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఎన్డీఏ లలో ఉద్యోగాలను ఇస్తోంది. కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసరడం కాదు, ఈ సవాలులో గెలవడానికి బీజేపీ సామాన్య కర్త సరిపోతాడు. తెరాస కు ఇదే ఆఖరి అధికారం.. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తాము.  కేటీఆర్ కు పట్టిన బలుపు అంత దిగేలా చేస్తాము. పై విధంగా రాజా సింగ్ తెరాస ను మరియు కేటీఆర్ కేసీఆర్ లపై రెచ్చిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: