ఇప్పుడు ఏపీలో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశాల్లో మంత్రివర్గ విస్తరణ కూడా ఒకటి అని చెప్పొచ్చు...ప్రస్తుతం టీడీపీ-జనసేన పార్టీల పొత్తు అంశంపై బాగా చర్చలు నడుస్తున్నాయి..తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పొత్తు అంశం తెరపైకి వచ్చింది..ఇక ఇటీవల జగన్ సైతం మంత్రివర్గ విస్తరణపై వ్యాఖ్యలు చేశారు...జూన్ లేదా జులైలో విస్తరణ చేస్తానని చెప్పుకొచ్చారు...దీంతో మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి..ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు..ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే అంశాలపై చర్చలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎస్టీ, ఎస్సీ కోటాలో పదవి దక్కబోయేది ఎవరికి అనే అంశంపై చర్చ నడుస్తోంది..ప్రస్తుతం క్యాబినెట్‌లో ఎస్టీ కోటాలో పుష్పశ్రీ వాణి మంత్రిగా ఉన్నారు..అలాగా ఎస్సీ కోటాలో విశ్వరూప్, తానేటి వనిత, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి మంత్రివర్గంలో ఉన్నారు. అయితే త్వరలోనే జరగబోయే విస్తరణలో వీరి పదవులు ఊడనున్నాయి...వీరిలో ఒక్కరూ కూడా కొనసాగడం కష్టం. ఇక వీరిని తప్పిస్తే...వీరి ప్లేస్‌లో రావడానికి చాలామంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు.

ఎస్టీ కోటాలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పదవి దక్కించుకోవడానికి చూస్తున్నారు...ఇంకా కొంతమంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు గాని..ఈ ఇద్దరే సీనియర్ ఎమ్మెల్యేలు. వీరిలో రాజన్న దొరకు ఖచ్చితంగా పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది..మొదట విడతలోనే పదవి రావాలి గాని...బొత్స సత్యనారాయణ ప్రభావం వల్ల పదవి పుష్పశ్రీకి వచ్చింది. ఈ సారి మాత్రం రాజన్నకు పదవి గ్యారెంటీ అని తెలుస్తోంది.

అటు ఎస్సీ కోటాలో పదవి కోసం చాలామంది ట్రై చేస్తున్నారు..దాదాపు 10 మంది పైనే ఎమ్మెల్యేలు ఎస్సీ కోటాలో పదవి దక్కించుకోవడం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కడప జిల్లాకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులుకు క్యాబినెట్‌లో ఖచ్చితంగా ఛాన్స్ దొరకనుందని తెలుస్తోంది..మొత్తానికి రాజన్న దొరకు, కోరుముట్ల శ్రీనివాసులుకు పదవులు దక్కడం ఖాయమని చెప్పొచ్చు..చూడాలి మరి చివరికి జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: