తెలంగాణ, హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది. బోయిగొండ లో జరిగిన దుర్ఘటనను మరిచిపోక ముందే మరో అగ్ని ప్రమాదం అందరి మనసులని కలచి వేచింది. బాగంబర్ పేటలోని సీజన్స్ హాస్పిటల్ సమీపంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో 50 గుడిసెల వరకు మంటల్లో దగ్దం అయ్యాయి. అయితే అదృష్టవ శాత్తూ ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అక్కడి వారు కాస్త ఊపిరి తీసుకున్నారు. మంటలు చెలరేగగానే అది చూసిన ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. బతుకమ్మ కుంట, మలక్ పేట, అంబర్ పేట నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన మంటలను ఆపారు.

అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు మంటలు రావడానికి గల కారణాల గురించి తెలుసుకోవడానికి చూస్తున్నారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రమాదానికి దారి తీసిన వివరాలు తెలుసుకుంటాము అని చెప్పారు.  హైదరాబాద్‌లోని  బోయిగూడలో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే. శాద్వన్ స్క్రాప్ గోడౌన్‌లో చెత్త కాగితాలు మరియు ప్లాస్టిక్ కాలి అక్కడ ఉన్న మందు బాటిళ్లు సామాన్లు అంటుకోడంతో మంటలు ఒక్క సారిగా చెలరేగాయి, కొద్దీ వ్యవధిలోనే అంతా వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం కావడం దురదృష్టకరం.

ఈ షాక్ నుండి పూర్తిగా కొలుకోకముందే సిటీలో ఇలా మరో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆ దేవుడి దయ వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వం సైతం అలర్ట్ అయింది. ఈ ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. పైగా పొద్దున్న చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే కేసీఆర్ ఆర్ధిక సహాయం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: