ఇండియా చైనా మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది సరిహద్దు సమస్య.. అటు కాశ్మీర్ నుంచి ఇటు అరుణచల్ ప్రదేశ్ వరకూ అనేక భూభాగాల విషయంలో చైనా, ఇండియా మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి కొన్నిరాష్ట్రాల్లో ఈ విషయం చైనా, ఇండియా యుద్ధం వరకూ వెళ్లివచ్చాయనే చెప్పాలి. గాల్వన్ లోయలో చిన్న సైజు యుద్ధం తర్వాత ఇండియా, చైనా చర్చల మార్గంలోనే ఉన్నాయి. తాజాగా విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌.. భారత పర్యటనకు విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమైన జయ్‌శంకర్‌ చర్చించారు.


ఈ చర్చల ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించిన చైనా మంత్రి  చర్చించారు. సరిహద్దు ఉద్రిక్తతల వల్ల భారత్‌, చైనా సంబంధాలపై పడిన దుష్ప్రభావాన్ని గత రెండేళ్లలో చూశామని విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌ అన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించడంపై ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పురోగతి సాధించినా, ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తూర్పు లద్దాఖ్‌ అంశంపై భారత్‌ వైఖరిని చైనా విదేశాంగ మంత్రి వద్ద నిజాయితీగాచెప్పామని జయ శంకర్ అన్నారు.


ఇలాంటి వివాద పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందన్న జయశంకర్ దాన్ని వేగవంతం చేయడంపై వాంగ్‌ యీతో ప్రధానంగా చర్చించామన్నారు. భారత్‌, చైనా మధ్య సీనియర్‌ సైనిక కమాండర్ల స్ధాయిలో 15 విడతల చర్చలు జరిగిన విషయం తెలిలిందే. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించే అంశంపై ఈ చర్చల్లో పురోగతి కూడా కొంత వచ్చింది.


ఇలాంటి సమయాల్లో చైనా సమస్య మరింత పెద్దది కాకుండా చర్చలు జరిపాలని.. అందుకు చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించడం అవసరమన్నారు. భారత్‌, చైనా మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇవి నెమ్మదిగా సాగుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో తాను జరిపిన చర్చలు ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా సాగాయన్నారు జయ శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: