గత రెండు మూడు నెలలుగా ఏపీలో కొత్త జలాల కోసం కసరత్తులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రతి పక్షాలు అడ్డు పడుతూ రావడంతో అలా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడుతూ ఈ రోజు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. రాజదాని అంశం ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. ఏపిలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. కొత్త జిల్లాల ఆవిష్కరణకు ఆమోదం తెలుపుతూ ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది రాష్ట్ర కేబినెట్‌. ఈ మేరకు వివరాలు తెలియచేస్తూ... ఏప్రిల్‌ 4వ తేదీన ఉదయం 9గం.05ని నుండి 9గం.45ని. మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు జరగనున్నట్లు ప్రకటించారు. 

జగన్ సర్కారు కొత్త జిల్లాల ఉద్దీపన మేరకు 26 జిల్లాల ఏర్పాటుకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలుపుతూ ప్రకటించింది కేబినెట్‌. కొత్తగా అమలు లోకి రానున్న జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి, అనకాపల్లి, కోనసీమ, పార్వతీ పురం మన్యం, అల్లూరి,  రాజమండ్రి, అన్నమయ్య, నరసాపురం,  నర్సరావుపేట, విజయవాడ, నంద్యాల, సత్యసాయి, బాపట్ల, ఎన్టీఆర్  జిల్లాలు అమలు లోకి రానున్నట్లు తెలియచేశారు. అదే విధంగా తిరువూరు, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, పలాస, నందిగామ, బొబ్బిలి, భీమవరం, ఉయ్యూరు,  బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్‌, గుంతకల్‌, ధర్మవరం, రాయచోటి, పుట్టపర్తి,  పలమనేరు, శ్రీకాళహస్తి, కుప్పం లను రెవెన్యూ డివిజన్లు గా అమలులోకి రానున్నాయి.

ఇలా ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాల్ని మరియు రెవెన్యూ డివిజన్ లను వర్గీకరించారు. మరి దీనిపై ముందు ముందు ఏ వివాదాలు పుట్టుకొస్తాయో చూడాలి.  ఇక వాలంటీర్ల సేవలు రాష్ట్రానికి ఎంత గానో ఉపయోగపడుతున్న నేపథ్యం లో ఏప్రిల్‌ 6వ తేదీన వాలంటీర్లకు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: