పార్టీ కోసం దాదాపు తొమ్మిదేళ్ళు కష్టపడిన కార్యకర్తల సంక్షేమంకోసం జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచన చేస్తున్నారు. ఏపార్టీకి అయినా కార్యకర్తలే అండా దండా అన్న విషయం తెలిసిందే. పార్టీ జెండాలను మోసేది కార్యకర్తలు, బ్యానర్లు కట్టేది, తమ నేతల కోసం చొక్కాలు చింపుకునేది కూడా చివరకు కార్యకర్తలే. అలాంటివారికోసం ఎంత చేసినా తక్కువే అవుతుంది. అందుకనే అవకాశం ఉన్నంతలో కార్యకర్తల న్యాయచేయాలని జగన్ అనుకున్నారు.





ఇందులో భాగంగానే అచ్చంగా కార్యకర్తల కోసమే జాబ్ మేళాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించిన జగన్ జాబ్ మేళాల బాధ్యత కూడా ఎంపీ మీదే ఉంచారు. ఈ నెలలో తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులో జరగనున్న మూడు జాబ్ మేళాల్లో కనీసం 20 వేలమందికి ఉద్యోగాలు వచ్చేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల కోసం వైజాగ్, రాయలసీమ, నెల్లూరు జిల్లాల కోసం తిరుపతిలో, ప్రకాశం, రాజధాని జిల్లాల కోసం గుంటూరులో జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు.





వివిధ కంపెనీల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరిపారట. జాబ్ మేళాల్లోనే అర్హతలు కలిగిన వారికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు అక్కడికక్కడే అపాయింట్ లెటర్లు కూడా యాజమాన్యాలు ఇచ్చేట్లు విజయసాయిరెడ్డి ఏర్పాట్లుచేశారు. ఇలాంటివే చిన్న తరహాలో ఇప్పటికే నగిరిలో ఎంఎల్ఏ రోజా చేసున్నారు.  పుత్తూరు, నగిరి లోని నిరుద్యోగుల కోసం రోజా కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు ఏర్పాటు చేయించారు.





రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున అచ్చంగా పార్టీ కోసం కష్టపడిన వారికోసమే ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయి చెప్పారు. ఇపుడు సక్సెస్ అయ్యే మేళాను బట్టి భవిష్యత్ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటారు.  ఏప్రిల్ 16-17 తేదీల్లో తిరుపతి ఎస్ వి యూనివర్సిటి, 23-24 తేదీల్లో వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటి, ఏప్రిల్ 30, మే 1వ తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్ మేళాలు జరగబోతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన 20 వేలమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇప్పించటమంటే మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: