రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు అండగా చైనా నిలుస్తోందన్న విషయం తెలిసిందే. చైనా దేశం బహిరంగంగానే రష్యాకు మద్దతు ఇస్తోంది. మరోవైపు ఇండియా రష్యాకు పరోక్షంగా సాయం చేస్తోంది. అయితే.. చైనా మాత్రం రష్యాకు మద్దతుగా నేరుగా అమెరికాతో మాటల యుద్ధానికి దిగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముగింపు పలకడం అమెరికా చేతుల్లోనే ఉందని చైనా విదేశాంగశాఖ డైరెక్టర్‌ జనరల్‌ అంటున్నారు.


యుద్ధం ఎలా ముగుస్తుందో కూడా చైనా చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా సమావేశమై ఉక్రెయిన్‌ అంశంలో నాటో జోక్యం చేసుకోబోదని ఒప్పందం చేసుకోవాలని సూచించింది. అలా జరిగితే యుద్ధం వెంటనే ముగుస్తుందని చైనా అంటోంది. అంతే కాదు.. భవిష్యత్తులోనూ ఉక్రెయిన్‌లో సైన్యం,ఆయుధాల మోహరింపు చేయబోమని పుతిన్‌కు హామీ ఇవ్వాలని కూడా చైనా సూచిస్తోంది.


ఉక్రెయిన్‌ అంశంలో అమెరికా వైఖరి అర్థం కావడం లేదంటున్న చైనా ఉన్నతాధికారి.. బైడెన్‌ యుద్ధం ముగియాలని అనుకుంటున్నారా..లేక రష్యాను బలహీనపర్చాలని ఆశిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. రష్యాలో ప్రభుత్వ మార్పునకు అమెరికా ప్రణాళికలు రచిస్తోందా అంటూ చైనా అమెరికాను నిలదీసింది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలంటే పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌ తక్షణమే సమావేశం కావాలని చైనా సూచిస్తోంది. అంతే కాదు.. రష్యాపై ఆంక్షలు విధించడం వల్ల ఒరిగేదేమి లేదని చైనా ఉన్నతాధికారి వాంగ్‌ స్పష్టం అంటున్నారు.


మొత్తానికి ఉక్రెయిన్- రష్యా యుద్దం సమయంలో అమెరికా పిరికితనం ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. అంతే కాదు.. ఎంతసేపు ఇతర దేశాలపై పెత్తనం చేయడమే పనిగా అమెరికా పెట్టుకుందన్నవాదన ఉంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై నెల దాటుతున్నా అమెరికా ఇంకా జోక్యం చేసుకోవడాన్ని ఇతర దేశాలు కూడా ఖండిస్తున్నాయి. మొత్తానికి చైనా మాత్రం రష్యాకు పూర్తి మద్దతు ఇస్తూ రష్యా అభిమానం చూరగొనే ప్రయత్నాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: