చంద్రబాబు ఎవరు.. ప్రతిపక్ష నేత.. ఆయన కుప్పం ఎమ్మెల్యే కూడా.  ఓ ఎమ్మెల్యేగా తన ప్రజల సమస్యలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటారు కూడా.. తాజాగా ఆయన ఆలా తీసుకెళ్లిన సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు.. మా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయండి అని కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రిప్రజెంటేషన్‌ ఇస్తే.. సీఎం జగన్ కాదనకుండా చేసేశారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి మనస్తత్వం ఎవరు ఏది అడిగినా కాదనలేని మనస్తత్వం అని చెప్పుకుంటున్నారు.


జగన్.. గొప్ప మనసున్న నాయకుడని.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి, 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్ గా జగన్ మోహన్ రెడ్డిగారు చేశారని... చంద్రబాబు చేయలేని పనిని, కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయడమే జగన్ గారు చేసిన తప్పా..? అని ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.


వాస్తవానికి కుప్పం రెవెన్యూ డివిజన్ చేసేంత పెద్దది కాదని.. చిన్న డివిజన్ అయినా.. చంద్రబాబు అడిగారు కాబట్టి..  వైయ‌స్‌ జగన్ గారు మంచి మనసుతో అది చేయగలిగారని ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. ఆయన ఇంకో విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. ఎన్టీఆర్ , ఆ తర్వాత 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా హిందూపురంను ఎందుకు జిల్లా చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. మీరు అప్పట్లో జిల్లా చేస్తామంటే, ఎవరైనా వద్దన్నారా.. అని నిలదీస్తున్నారు.


ప్రస్తుతం చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలని అడుగుతున్నాడని.. మరి ఇంతకాలం, మీరెందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.. ప్రజల ఆకాంక్షల మేరకే జగన్ మోహన్ రెడ్డిగారు జిల్లాల కూర్పులో చిన్న చిన్న మార్పులు చేశారుని.. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నా ప్రతిపక్ష పార్టీలే మంచిని పక్కన పెట్టి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: