ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం లోని అర్హులకు  అమ్మఒడి డబ్బులు అందాల్సి ఉండగా కొన్ని కారణాల వలన ఈసారి కాస్త జాప్యం జరిగింది. అయితే అర్హులైన విద్యార్దులకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అమ్మఒడి నగదును అందజేస్తామని చెప్పుకొచ్చారు. కాగ జూన్ లో అమ్మఒడి పథకం నగదును అర్హులైన వారి ఖాతాలలో జూన్ లో జమచేయనుంది ప్రభుత్వం . అయితే ఈ పథకాన్ని ఎటువంటి సమస్య లేకుండా నేరుగా అందుకోవడానికి మీ వివరాలు అన్ని మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులు తమ ఆధార్ ను గ్రామ,వార్డు సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు తప్పక లింక్ చేసుకోవాల్సిందిగా సూచించింది ప్రభుత్వం. కావున లబ్ది దారులంత ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా పథకం లబ్ది పొందేందుకు ముందుగా ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లో అమ్మఒడి కి సంబంధించినటువంటి విద్యార్ధుల తల్లి ఆధార్ నంబర్ కు లింక్ చేసినటువంటి బ్యాంక్  నంబర్ ను మాత్రమే నమోదు చేయాల్సిందిగా స్పష్టం చేసింది సర్కారు.  అదే విధంగా ఒకసారి ఈ పథకం కొరకు సదరు విద్యార్థుల వివరాలను మరొకసారి సరి చూసుకోవాలని సూచించింది. కావున తల్లి తండ్రులు sachivalayalaku వెళ్లి ఈ మేరకు వివరాలను ఇవ్వాల్సి ఉంది.

జగన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది.  వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక  అమలులోకి తెచ్చిన  అద్భుతమైన పథకాల్లో అమ్మ ఒడి కూడా ఒకటి. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్ధిక సమస్యలు ఇబ్బంది కాకూడదు అన్న గొప్ప ఆలోచనతో సిఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు  అమ్మఒడి పథకం కింద 1 వా తరగతి నుండి 12 వా తరగతి లోపు చదువుతున్న విద్యార్థులకు ఏటా 15000 రూపాయలు ప్రభుత్వం నుండి అందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కుటుంబాల్ని ఒక బిడ్డకు మాత్రమే అందుతుంది. ఈ పథకాన్ని పొందటానికి విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: