క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పు-2  తర్వాత మాజీమంత్రుల నుండి కానీ ఎంఎల్ఏల నుండి కానీ అసంతృప్తులు బయటపడిందైతే వాస్తవమే. అయితే ఈ అసంతృప్తులు మూడు రోజుల తర్వాత చల్లారినట్లు అనిపించినా నివురుగప్పిన నిప్పులాగే ఉందని అర్ధమవుతోంది. నెల్లూరులో మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎంఎల్ఏల కోటంరెడ్డి శ్రీధరరెడ్డి భేటీయే తాజా ఉదాహరణ.





వీళ్ళద్దరికీ తాజామంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో పడదు. అలాగని వీళ్ళద్దరికి కూడా పడదు. కానీ శతృవుకి శతృవు మిత్రుడన్న పద్దతిలో కాకాణికి వ్యతిరేకంగా వీళ్ళద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. అంటే కాకాణికి ముందున్నది పూలబాట కాదు ముళ్ళబాటే అనేది అర్ధమవుతోంది. మరి వీళ్ళ మధ్య వైరం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. అలాగే అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట ఎంఎల్ఏ గొల్లబాబురావు మండిపోతున్నారు. తనకన్నా జూనియర్లకు మంత్రిపదవులిచ్చి జగన్మోహన్ రెడ్డి తనను అవమానించినట్లు ఫీలవుతున్నారు.చివరకు ఆధిపత్యం గొడవలతో వీళ్ళలో వీళ్ళు కొట్టుకుని చివరకు టీడీపీకి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయి. 





ఇక చిత్తూరు జిల్లాలో రోజాకు మంత్రిపదవి రావటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమాత్రం ఇష్టంలేదని తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో నగిరిలో రోజా గెలుపు ఇప్పటికైతే అనుమానంగానే ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదీ ఇదే గోల. తనను క్యాబినెట్లో నుండి తొలగించటంపై మండిపోతున్నారు. గుంటూరులో మరో మాజీ మేకతోటి సుచరితది కూడా ఇదే బాట. కృష్ణాజిల్లాలో జగ్గయ్యపేట ఎంఎల్ఏ సామినేని ఉదయభాను కూడా రగిలిపోతున్నారు.





ఇలాంటి ఘటనలే ఇంకా అక్కడక్కడ కనబడుతున్నాయి. అంటే తాజా మంత్రులకు- తాజామాజీల్లో కొందరికి పడటంలేదు. దీని ప్రభావం దీని ప్రభావం ఆయా జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే జరిగితే టీడీపీ బలపడేందుకు లేదా కొన్నినియోజకవర్గాల్లో గెలిచేందుకు వైసీపీ నేతలే కారణమైనా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: