ఏపీ లో జగన్ పాలనపై అనేక విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం సంక్షేమ పధకాలను ఇస్తూనే అందులో కోతలు పెడుతున్నారు. ఒక్కో పధకానికి అర్హులు కావాలంటే ఈ క్రింది నిబంధనలు పాటించాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రజలకు పధకాలు దక్కకుండా చేస్తున్నారని గతంలో చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలు మరియు వార్తాపత్రికలు చెప్పాయి. అయితే వీటన్నిటికీ కౌంటర్ లు ఇచ్చుకుంటూ వచ్చారు వైసీపీ నాయకులు. తాజాగా మరొక పథకంపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనితో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం.

జగన్ పాలనలోకి వచ్చిన సమయంలో కొన్ని సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒక పధకమే అమ్మఒడి. ఈ పధకం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న చిన్న పిల్లలను స్కూల్ కు పంపితే ప్రభుత్వం నుండి వారికి 15 వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలోకి వచ్చి చేరుతుంది. అయితే ఇందుకు ప్రధమంగా కొన్ని నిబంధలను పెట్టారు, ప్రతి ఇంటి నుండి కేవలం ఒక్క బిడ్డకే అర్హత మరియు సదరు విద్యార్థి కనీసం మొదటి తరగతి చదువుతూ ఉండాలి అన్నవి కొన్ని ఉన్నాయి. కానీ తాజాగా మరికొన్ని నిబంధనలను చేర్చినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆ నిబంధనలు ఏవి అంటే,

అమ్మఒడి అర్హత పొందాలంటే వారి ఇంట్లో విద్యుత్ వినియోగం 300 యూనిట్ లకు మించకూడదు. ఒకవేళ మించితే వారు ఈ పధకానికి అనర్హులు అవుతారని తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే ఏపీలో జిల్లాలను పెంచిన సంగతి తెలిసిందే. ఒకవేళ మీరు ఉండే ప్రదేశంలో జిల్లా మారినట్లయితే ఆధార్ కార్డు లో మారిన కొత్త జిల్లా పేరును నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా స్కూల్ కి వెళ్లే విద్యార్థికి ఖచ్చితంగా 75 శాతం జహారు ఉండాలి. ఇక మీ సంబంధిత వాలంటీర్ వద్ద మీ పిల్లవాడి వయస్సు, పేరు, తల్లి పేరు అన్ని వివరాలను సరిచూసుకోవాలి.

ఇక రానున్న విద్యా సంవత్సరం నుండి ఈ అమ్మఒడి అర్హత పొందాలంటే, కొత్త రేషన్ కార్డు ఉండాలి. ఇంటింటి సర్వేలో తల్లి బిడ్డ ఒకే మ్యాపింగ్ లో ఉండాలి. పిల్లవాడికి సంబంధించిన ఈ కెవైసి పూర్తి చేసుకోవాలి. తల్లి ఆధార్ మరియు బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాలి. ఇలా అన్ని వివరాలు సరిగా ఉంటేనే అమ్మఒడి అందుతుంది. ప్రస్తుతం ఈ విషయంపై తల్లులు అంతా నిరాశకు లోనవుతున్నారు. జగనన్న ఇంతేనా ఇది అంటూ బాధపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: