వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం విదితమే. కాగా ఇపుడు ఆ ఆఫర్ కు గడువు ముగిసే సమయం ఆసన్నమైంది. మరో సారి ఆఫర్ లు ఇస్తారో లేదో అన్న దానిపై క్లారిటీ లేదు. అంతే కాదు ఈ గడువును పొడిగించడం అస్సలు ఉండదు అంటూ షాక్ ఇచ్చింది. దాంతో వాహనదారులు రాయితీని అందుకోవాలి అంటే తప్పక గడువు లోపు తమ వాహనాలపై విధించిన చలానాలు చెల్లించక తప్పని పరిస్థితి.  వివిధ రకాల కారణాల వలన పలు వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త తరహాలో అమలు చేస్తున్న రాయితీ ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది.
 
పెండింగ్‌ చలనాలను రాబట్టుకునేందుకు రాయితీ ఇస్తూ చెల్లించడానికి మార్గం సులభతరం చేసింది సర్కారు. ఈ రైతులకు గడువు మొదట్లో మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఇవ్వగా , దానిని మరో పదిహేను రోజులు పాటు పొడిగించారు ట్రాఫిక్ పోలీసు అధికారులు. అంటే ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఇచ్చారు. అనగా నేటితో పెండింగ్‌ చలాన్లు రాయితీ గడువు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో మరో సారి గుర్తు చేస్తున్నారు. కావున పెండింగ్ చలాన్ లను చెల్లించి రాయితీ పొందటం ఉత్తమం. లేదంటే గడువు పూర్తి అయ్యే లోపు చలాన్లు చెల్లించకపోతే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంతకు అంత చెల్లించాలి అంటూ హెచ్చరిస్తున్నారు.

మరి అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ద్విచక్ర వాహనాలు లేదా ఫోర్ వీలర్ ల పైన ఏదైనా చలానాలు చెల్లించకుండా పెండింగ్ లో ఉన్నట్లయితే వెంటనే చెల్లించి, ట్రాఫిక్ వారు విధించే అదనపు భారం నుండి బయట పడండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయం గురించి తెలియ చేసి సహాయం చేయండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: