ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్టీసి. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను మళ్ళీ పెంచేసింది. గతం లో రూ.20 పెంచగా ఇప్పుడు మరో రూ.10 అదనంగా పెంచింది. రిజర్వేషన్‌ పై రూ.10 పెంచడం జరిగింది. గతంలో సర్వీసు ఛార్జీలు రూ.20 పెంచగా, ఇపుడు మరో రూ.10 పెంచి మొత్తం రూ.30 కి చేసింది. డీజిల్‌ ఛార్జీలు అనూహ్యంగా పెరగటంతో ఈ పరిస్థితి నెలకొంది. అటు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతున్న పెట్రోల్ - డీజల్ ధరలతో దారుణంగా మారుతోంది. కనీసం ఇలా కొంతలో కొంత చార్జీలను పెంచి నష్టాలను తగ్గించాలనే ఉద్దేశం తోనే ఇలా ధరలు పెంచినట్లు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఒకవైపు పెట్రోల్ - డీజల్ ధరలు మరో వైపు నిత్యావసర సరుకుల ధరలు ఇంకో వైపు ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బాదుడే బాదుడు అన్న తరహాలో పెంచేస్తున్నారు. నిత్యం ఇలా ధరలు పెంచేస్తూ సామాన్య ప్రజల నెత్తిపై పిడుగులు కురిపిస్తున్నారు. జీత భత్యాలు పెరగడం లేదు కానీ... ఈ జీ ఎస్ టి లు, పెట్రోల్, నిత్యావసర సరుకుల, చార్జీల ధరలు మాత్రం హద్దు పద్దు లేకుండా ఇష్టానుసారం పెంచేస్తున్నారు. మరి సగటు సామాన్యుడు ఈ సమాజంలో ఎలా కనీస సౌకర్యాలతో జీవించగలడు , ఎలా ఆర్థిక భారాన్ని భరించగలడు అన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కలగడం లేదో ఏమో, కరుణ చూపించాలని అనిపించడం లేదో ఏమో కానీ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు.

కానీ ఎవరు ఈ అన్యాయాన్ని ఆపడానికి, సామాన్యుడికి సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అసలు నిత్యం ఇలా వరుసగా ఇలా పెట్రోల్ - డీజల్ రేట్లు పెంచుతూ పోతుంటే సామాన్యుడు వాహనాలు నడిపే స్థాయిని కోల్పోతాడు. మరి ఈ ధరలకు ఇకనైనా చెక్ పెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: