ఇండియాలో ఆధార్ కార్డు విలువ తెలిసిందేగా.చాలా ముఖ్యమైన గుర్తింపు పత్రాలలో ఒకటి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన ఆధార్ కార్డ్ మీ చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి చాలా అంటే చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యడం నుండి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చెయ్యడం వరకు, దాదాపు ప్రతిచోటా కూడా ఆధార్ కార్డ్ అవసరం. మీ ఆధార్ కార్డ్‌లోని పొరపాట్ల వల్ల ఈ ముఖ్యమైన పనుల కోసం ఆధార్ ని ఉపయోగించడం చాలా కష్టమవుతుంది. అందువల్ల, మీ ఆధార్ కార్డ్‌లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దడం లేదా సరైన సమయంలో ఏదైనా అప్‌డేట్ చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం.ఇక మీరు uidai వెబ్‌సైట్ ఇంకా ఆధార్ కేంద్రం నుండి మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ తెలియకపోతే, ఆన్‌లైన్‌లో కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ స్థానిక భాషలో మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయవచ్చు.


ముందుగా మీరు uidai అధికారిక వెబ్‌సైట్‌ను  (https://uidai.gov.in/ ) ఓపెన్ చెయ్యండి.అందులో ‘ఆధార్ సర్వీస్ సెక్షన్’ కింద ఉన్న ‘సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను అక్కడ ఎంటర్ చేయండి.సేఫ్టీ కోడ్‌ను నమోదు చేసి, అవసరమైన అన్ని ఇతర వివరాలను కూడా పూరించండి. రూపొందించబడిన OTPపై క్లిక్ చేయండి. వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. ఇక్కడ, మీరు 'అప్డేట్ డేటా బటన్'పై క్లిక్ చేయాలి. ఇప్పుడు, మీరు ప్రాంతీయ భాషను ఎంచుకున్న తర్వాత వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. మరోసారి మీరు ఇక్కడ నమోదు చేయవలసిన OTP నెంబర్ ని పొందుతారు. మీరు ప్రకటనను చూసిన తర్వాత, మీరు టిక్ చేసి, ఆపై ప్రొసీడ్ బటన్‌ను నొక్కాలి. మీ వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు రూ. 50 ఫీజుని కూడా చెల్లించాలి. ఈ దశలను అనుసరించడం ద్వారా, మీరు మీ స్థానిక భాషలో ఏదైనా సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు. ముఖ్యంగా, కావలసిన మార్పులు చేయడానికి మీకు మీ మొబైల్ నంబర్ ఇంకా అలాగే మీ ఆధార్ నంబర్ అవసరం.


ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయకూడదనుకుంటే, మీరు మీ సమీప uidai కేంద్రాన్ని సందర్శించవచ్చు. అక్కడ మీరు ఒక ఫారమ్‌ను పూరించాలి మరియు మీరు మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటున్న అన్ని వివరాలను అక్కడ సమర్పించి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: